Editorials

బలమైన సాక్ష్యాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు: సజ్జల

బలమైన సాక్ష్యాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం వ్యూహకర్త, నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని అన్నారు. స్కాంకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయన్నారు. బలమైన సాక్ష్యాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని.. చేసిన నేరానికి తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తరఫున దత్త పుత్రుడు హంగామా చేశారని ఎద్దేవ చేశారు. ఇదిలావుంటే, చంద్రబాబు జీవితాంతం చిప్పకూడు తింటారని చెప్పారు వైసీపీ మంత్రి రోజా. చంద్రబాబుకు మద్దతుగా ఉన్న నేతలంతా జైలుకెళ్లే రోజు వస్తుందని జోస్యం చెప్పారామె. స్కిల్ స్కామ్‌ కేసులో విజయవాడ ఏసీబీ కోర్ట్‌ చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగానే ఆమె తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచారు. బాణాసంచా కాల్చారు. మరోవైపు, జగన్‌ అవినీతికి పాల్పడ్డాడని , రెడ్‌ డైరీలో వివరాలు ఉన్నాయంటున్న లోకేష్ ఇప్పుడు తన తండ్రి అవినీతి గురించి ఆ డైరీలో రాసుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.