NRI-NRT

ఆస్ట్రేలియా-కువైట్‌లలో చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు

ఆస్ట్రేలియా-కువైట్‌లలో చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. సరైన కారణాలు చూపకుండా.. దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్టుచేసి మరోసారి సైకో బుద్ధిని బయటపెట్టిందని నేతలు ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమని మండిపడ్డారు. లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యంగా మద్దత్తు వస్తుండటంతో కంగారుపడిన వైకాపా ప్రభుత్వం చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. ‘సైకో పోవాలి – సైకిల్ రావాలి’, ‘డౌన్ డౌన్ జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సుధాకర రావు, వెంకట్ కోడూరి, నాగేంద్ర బాబు అక్కిలి, మద్దిన ఈశ్వర్ నాయుడు, మల్లి మారోతు, విసి సుబ్బారెడ్డి, రెడ్డి మోహన్ రాచూరి, చాన్ బాష, ముస్తాక్ ఖాన్, బాలరెడ్డయ్య, నారాయణమ్మ, యెనిగళ్ల బాలకృష్ణ, మద్దిపట్ల శివ, అర్షద్, చిన్న రాజు, చామర్తి రాజు, పిడికిటి శ్రీనివాస్ చౌదరి, శ్రీకాంత్ తదితర నేతలు, నందమూరి, నారా అభిమానులు పాల్గొన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు 45 ఏళ్ల పాటు మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపారని వారు తెలిపారు. తెదేపాకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల అవినీతి కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ అందరూ తనలాంటి వారే అన్న భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. అక్రమ కేసులు, అరెస్టులతో తమ నాయకుడిని, పార్టీ కార్యకర్తలను భయపెట్టలేరని తెలిపారు. దీనికి తగిన సమాధానం రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.