NRI-NRT

లండన్ పార్లమెంట్ వద్ద చంద్రబాబు అరెస్టుకు నిరసన

UK NRIs Protest Near London Parliament

లండన్‌లోని పార్లమెంట్‌ ఎదురుగా కుల, మత, పార్టీలకు అతీతంగా దాదాపు 1000 మంది ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. యూకే వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చి నల్లచొక్కాలు ధరించి గాంధీ విగ్రహం వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా, వైకాపా సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతి కోసం 40 ఏళ్లుగా కష్టపడి పనిచేసిన చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించడం ప్రజస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని.. అలాంటి వ్యక్తి పట్ల ఏపీ సర్కార్‌ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.