Movies

‘ఓజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

‘ఓజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫెస్టివల్ ట్రీట్ అందింది. ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఫిల్మ్ OG శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్ చేస్తుండటం విశేషం.ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ అదిరిపోయాయి. పోస్టర్లు, గ్లింప్స్ ఆసక్తిని పెంచాయి. మూవీపై హైప్‌ను క్రియేట్ చేశాయి. దసరా ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు ఆయుధ పూజా, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ఆయుధాలకంటే అతని కంటిచూపు చాలా పవర్ ఫుల్’ అనే లైన్‌తో పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మాతగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. తమిళ నటుడు అర్జున్ దాస్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మిన్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.