Fashion

స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?

స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?

స్కిన్ ఫాస్టింగ్ అనేది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సరికొత్త స్కిన్‌కేర్ ట్రెండ్. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లో వేల సంఖ్యలో పోస్టింగ్‌లు, లక్షల్లో లైక్స్ సొంతం చేసుకున్న ఈ హ్యాష్‌ట్యాగ్ #SkinFasting అంటే ఏమిటి?

ఇది మన చర్మం ఆకృతిని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? లేక హాని కలిగిస్తుందా? తెలుసుకుందాం.

మార్కెట్ లోకి వచ్చిన కొత్త ప్రొడక్ట్స్.. చర్మానికి ఎలాంటి హీల్ ఇస్తాయి? సమస్యలను ఎదుర్కోవడంలో ఎలా ప్రభావవంతంగా పనిచేస్తాయి? చెప్తూ.. కస్టమర్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తాయి.

కానీ వీటి వాడకం వల్ల చర్మం సహజ అందాన్ని కోల్పోతుంది. అయితే ‘స్కిన్ ఫాస్టింగ్’ వెనుక ఉన్న ఆలోచన మీ చర్మానికి ఆ ఉత్పత్తుల నుంచి విరామం ఇస్తుంది. చర్మాన్ని రీసెట్ చేయడానికి, రీబ్యాలెన్స్ చేసుకోవడానికి.. క్లెన్సర్‌, టోనర్, సీరమ్‌, ఎక్స్‌ఫోలియెంట్‌లతో సహా నిర్దిష్ట చర్మ సంరక్షణ ఉత్పత్తుల వినియోగానికి బ్రేక్ ఇస్తుంది. చర్మం పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుందని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.

బెనిఫిట్స్ :

* స్కిన్ ఫాస్టింగ్ చర్మాన్ని పునరుద్ధరించడానికి తగిన సమయాన్ని ఇస్తుంది.

* స్కిన్ హీలింగ్ కు కారణం అవుతుంది.

* లిపిడ్ బారియర్ ను రీస్టోర్ చేస్తుంది.

* చర్మపు సహజ తేమను ఆదా చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z