Devotional

10న ఎస్ఇడి శ్రీ‌వాణి టికెట్లు గ‌దుల కోటా విడుద‌ల

10న ఎస్ఇడి శ్రీ‌వాణి టికెట్లు గ‌దుల కోటా విడుద‌ల

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న విడుదల చేయనున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి రూ.300ల ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, రూ.10వేల శ్రీవాణి టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 2.25 లక్షల రూ.300ల ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు, రోజుకు 2వేల చొప్పున 20వేల శ్రీవాణి టికెట్లను మధ్యాహ్నం 3గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z