Business

మస్క్‌ తీరు పై మండిపడ్డ అమెరికా-వాణిజ్య వార్తలు

మస్క్‌ తీరు పై మండిపడ్డ అమెరికా-వాణిజ్య వార్తలు

* మస్క్‌ తీరు పై మండిపడ్డ అమెరికా

ఇజ్రాయెల్-హమాస్‌ (Israel-Hamas) యుద్ధం వేళ ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌ (X)’ వేదికగా యూదు వ్యతిరేక పోస్టులు రావడం, వాటిల్లో కొన్నింటికి ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మద్దతు పలకడం దుమారం రేపుతోంది. మస్క్‌ తీరుపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యానికి చెందిన దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌లో తమ యాడ్స్‌ను నిలిపివేస్తున్నట్లు యాపిల్‌ (Apple), డిస్నీ (Disney) వంటి సంస్థలు ప్రకటించాయి.ఎక్స్‌ వేదికగా యూదు వ్యతిరేక యూజర్లతో ఇటీవల మస్క్‌ విరివిగా సంభాషణలు జరిపారు. ఈ క్రమంలోనే యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్ట్‌కు మస్క్‌ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు’ అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తీవ్రంగా స్పందించింది. ‘‘మస్క్‌ స్పందన యూదు కమ్యూనిటీని ప్రమాదంలో పడేస్తోంది’’ అని మండిపడింది. అటు మస్క్‌ తీరుపై మండిపడిన కొన్ని దిగ్గజ సంస్థలు.. ‘ఎక్స్‌’లో తమ యాడ్స్‌ను నిలిపివేయాలని నిర్ణయించాయి.యాపిల్‌, ఐబీఎం, ఒరాకిల్‌, కామ్‌కాస్ట్‌, బ్రావో టెలివిజన్‌ నెట్‌వర్క్‌, యూరోపియన్‌ కమిషన్స్‌, లయన్స్‌ గేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్పొరేషన్‌, వాల్ట్‌ డిస్నీ, పారామౌంట్‌ గ్లోబల్‌, వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ వంటి సంస్థలు.. ఎక్స్‌ వేదికగా తమ యాడ్స్‌ ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు, మస్క్‌కు చెందిన టెస్లాలోనూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. టెస్లా సీఈవో పదవి నుంచి మస్క్‌ను సస్పెండ్‌ చేయాలని కొంతమంది సంస్థ వాటాదారులు డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా.. యాపిల్‌ గతంలోనూ కొంతకాలం పాటు ఎక్స్‌లో తమ ప్రకటనలను నిలిపివేసింది. గతేడాది ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను కొనుగోలు చేసిన మస్క్‌.. ఉద్యోగాల కోతతో పాటు పలు విధానపరమైన మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యాపిల్‌.. ఎక్స్‌ (అప్పటి ట్విటర్‌)లో యాడ్స్‌ను నిలిపివేసింది. అయితే, గతేడాది డిసెంబరులో మస్క్‌ స్వయంగా యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌తో సమావేశమై ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఆ తర్వాత యాపిల్‌.. ఎక్స్‌లో తమ యాడ్స్‌ను పునరుద్ధరించింది.

* భారీగా పెరిగిన మద్యం ధరలు

మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. మరోసారి మద్యం ధరలు పెరిగిపోయాయి.. క్వార్టర్‌ సీసాపై ఏకంగా ఒకేసారి రూ.10 వడ్డించారు.. ఫారిన్‌ లిక్కర్‌ పై కూడా వడ్డించింది ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ధరలు, మద్యం బ్రాండ్లపై ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు ఉన్నాయని మందు బాబులతో పాటు విపక్షాలు కూడా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరోసారి లిక్కర్‌ ప్రైజ్‌ పెంచేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది..పన్నుల సవరణ పేరిట పెంచిన తాజా ధరలతో క్వార్టర్‌ సీసాపై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెరిగిపోయాయి.. మద్యంపై విధించే అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఏఆర్‌ఈటీ)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్‌ శాఖ.. ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చాల్సిన అవసరం ఉందంటూ ఏపీఎస్‌డీసీఎల్‌ ప్రతిపాదనలు పంపగా.. వాటికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. దీంతో.. సవరణలు చేస్తూ ఏపీ ఎస్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఐఎంఎఫ్‌ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్‌ శాఖ.. ఈ సవరణ ఫలితంగా మరోసారి మద్యం ధరలు పెరిగాయి.. ఒక బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి చేరింది.. అదే క్వార్టర్‌ రూ.200 నుంచి రూ.210కి పెరిగింది.. అయితే, ఈ పెరుగుదల కొన్ని బ్రాండ్లకు పరిమితం అయ్యింది.. ఈ సవరణ తర్వాత కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు.. ఫారిన్‌ లిక్కర్‌ సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచింది ఎక్సైజ్‌ శాఖ.. చాలాకాలంగా ఫారిన్‌ లిక్కర్‌పై ధరలు సవరించలేదని, పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని.. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏఈ ఎక్సైజ్‌ శాఖ.

* 2030 నాటికి 200 బిలియన్​ డాలర్లకు ఫార్మా విలువ

ఉత్పత్తి పెంపు, ఎగుమతుల పెంపు ద్వారా దేశీయ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువ పరంగా 4-5 రెట్లు పెరిగి 200 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల పరిమాణాన్ని చేరుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఎగుమతుల విస్తరణపై దృష్టి సారించాలని అన్నారు.ఇందుకు ఫార్మా పరిశ్రమ సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “స్మార్ట్ మెడిసిన్ యుగం వస్తోంది. రాబోయే 20 నుంచి 30 సంవత్సరాలలో కొత్త చికిత్సలు, స్మార్ట్​థెరపీలు అందుబాటులోకి వస్తాయి. మనం ఆ యుగానికి సిద్ధంగా ఉండాలి’’ అని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు.పీఎల్​ఐ సహా వివిధ విధాన కార్యక్రమాలతో పరిశ్రమకు ప్రభుత్వం సహాయం చేస్తోందని ఆయన అన్నారు. ఫార్మా పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకోవడంలో సహాయం చేయడానికి ప్రభుత్వం పరిశ్రమలతో, విద్యాసంస్థలతో కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

* లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత రెండు రోజుల్లో రెండు వేర్వేరు కేసుల్లో రూ.1.26 కోట్ల విలువైన రెండు కిలోల బంగారాన్ని బెంగళూరు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్థరాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులు, కొలంబో నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికులను తనిఖీ చేయగా.. చొక్కాలు, లోదుస్తుల్లో బంగారు ఆభరణాలను దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి మొత్తం 966 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.58,39,806 ఉంటుందని అంచనా. శుక్రవారం మస్కట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి సొంత బెల్ట్‌లో రూ 68,18,812 విలువ చేసే 1.113 గ్రాముల బంగారు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మంగళూరు విమానాశ్రయంలో బంగారం స్వాధీనం: ఆగస్టు 31 నుంచి నవంబర్ 5 మధ్య మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.42,90,060 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 31 నుంచి నవంబర్ 2వ తేదీ మధ్య దుబాయ్ నుంచి మంగళూరుకు ఎయిరిండియా విమానంలో దిగిన ఇద్దరు వ్యక్తుల నుంచి మొత్తం రూ.17,49,660 వసూలు చేశారు. 228 గ్రాముల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.లోదుస్తులు, సాక్సుల్లో దాచి బంగారు గొలుసులు, బంగారు పేస్ట్ రూపంలో బంగారాన్ని తీసుకెళ్లారు. మరో కేసులో నవంబర్ 5న దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు చాక్లెట్ రూపంలో బంగారం పొడితో పట్టుబడ్డాడు. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో దిగిన ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్ అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు స్కాన్ చేసి తనిఖీ చేశారు. టిఫనీ ఎక్లెయిర్స్ అనే చాక్లెట్ ప్యాకెట్ దొరికింది.చాక్లెట్ తెరిచి చూడగా పసుపు పొడి కనిపించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పొడిని మరొక పొడితో కలిపి వెండి రంగు ప్లాస్టిక్ పేపర్‌లో చుట్టారు. అలాంటి ఏడు చాక్లెట్లను గుర్తించి 420 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.25,49,400. కస్టమ్స్ అధికారులు తెలిపారు.

* ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) స్పోర్ట్స్ కోటా- కింద 248 కానిస్టేబుల్ (జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 28లోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.క్రీడాంశాలు: బాక్సింగ్, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి. వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ.21,700 నుంచి -రూ.69,100 జీతం చెల్లిస్తారు.దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28 లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.itbpolice.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z