Agriculture

రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందరగోళం!

రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందరగోళం!

రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందర గోళ పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు రైతు బంధు వేసినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఒక దఫాలో ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రైతుబంధు వేసేందుకు సిద్ధం అయింది. విడతల వారిగా రైతుబంధు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది సర్కార్. పాత పద్దతిలో ఎకరానికి ఐదు వేల చొప్పున పెట్టుబడి సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ రైతుబంధు అందరికీ పడలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంత మందికి పడిందని అంటున్నారు. ఎవరికీ పడిందో..ఎవరికీ పడలేదో..తెలియడం లేదు. దీంతో రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందర గోళ పరిస్థితి నెలకొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z