Devotional

వారఫలాలు-24-12-2023 నుంచి 30-12-2023

వారఫలాలు-24-12-2023 నుంచి 30-12-2023

మేషం

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ, వృథా ఖర్చుల మీద అదుపు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. కొందరు సన్నిహితులతో కలిసి ఈ వృత్తిని విస్తరించాలనే ఆలోచన కూడా కలుగుతుంది. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం

రాశ్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా కుటుంబపరంగా కూడా అభివృద్ధి కనిపి స్తోంది. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విద్యార్థులు సునాయసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.

మిథునం

లాభస్థానంలో గురువు, రాశ్యధిపతి బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ముందడుగు వేస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగు లకు తప్ప కుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. విద్యా ర్థులు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సరదాగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి.

కర్కాటకం

ముఖ్యమైన ప్రయత్నాల విషయంలో సమయం అనుకూలంగా ఉంది. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మనశ్శాంతి తగ్గుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా ఇతోధికంగా సహాయం చేస్తారు. సర్వత్రా పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బుండే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురు కావచ్చు.

సింహం

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఒకటి రెండు సమస్యలు ఎదురైనా అవి తేలికగా ఝ పరిష్కారం అవుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఏ రంగానికి చెందినవారికైనా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉండడం, పిల్లలు వృద్ధిలోకి రావడం చాలావరకు మనశ్శాంతినిచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఆశించిన విధంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ప్రేమ భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

కన్య

వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి. మొత్తం మీద వారమంతా మనశ్శాంతిగా గడిచిపోయే అవకాశం ఉంది. ఇతరుల నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ ప్రయత్నాలతో మీరు ముందుకు సాగడం మంచిది. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదా యానికి లోటు ఉండదు. ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దేని గురించీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కొద్తి ప్రయత్నంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులతో విందులో పాల్గొనడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన శుభ ఫలితాలు అను భవానికి వస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు. కుటుంబ సమ స్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందు కుంటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలి స్తాయి.

వృశ్చికం

రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో ఉండడం వల్ల అనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సర్వత్రా ప్రాభవం పెరుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. నిజ జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు వేగంగా, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.

ధనుస్సు

గ్రహ బలం పూర్తి స్థాయిలో బాగా అనుకూలంగా ఉంది. సమయం అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయా నికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్త వుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహార, విహా రాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల విలువైన వస్తువులు కోల్పోయే సూచ నలున్నాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. విద్యార్థు లకు సమయం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

మకరం

కొన్ని ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఆశించిన విధంగా, సాను కూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను పట్టు దలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు శ్రమ మీద గానీ విజయాలు సాధించే అవకాశం లేదు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం

గ్రహ బలం కారణంగా ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ప్రతి చోటా మాట చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పను లను సమయానికి ముందే పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగు తుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. అయితే, ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవ హారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

మీనం

రాశ్యధిపతి గురువు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సానుకూల పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. పెద్దల సల హాలు, సూచనలతో వృత్తి, వ్యాపారాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయడం జరుగుతుంది. ఆదా యానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. మీ శత్రువులు కొందరు మిత్రులుగా మారతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z