ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమైంది. స్వామియే శరణం అయ్యప్ప.. నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉 – Please join our whatsapp channel here –