Devotional

సకాలంలో పనులు పూర్తి-వారఫలాలు-జనవరి 28 – ఫిబ్రవరి 03

సకాలంలో పనులు పూర్తి-వారఫలాలు-జనవరి 28 – ఫిబ్రవరి 03

మేషం
తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.

వృషభం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విదేశీ విద్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మిథునం
అదృష్టం కలిసివస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి డబ్బు అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం
ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం అవసరం. స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సూర్యారాధనతో మేలు జరుగుతుంది.

సింహం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణం ప్రారంభిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.

కన్య
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరం. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పనిభారంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధనతో మేలు జరుగుతుంది.

ధనుస్సు
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరం. సంయమనం అవసరం. రోజువారీ పనులు నిరాటంకంగా సాగుతాయి. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అదరణ లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z