Devotional

యాదాద్రిపైకి ఆటోలకు అనుమతి

యాదాద్రిపైకి ఆటోలకు అనుమతి

యాదగిరిగుట్టలో దాదాపు 500 మంది ఆటోడ్రైవర్లు బస్టాండ్ నుంచి దేవాలయం వరకు ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కొండపైకి ఇప్పటి వరకూ అన్ని వాహనాలకు అనుమతి లేదు. అయితే ఎక్కువ శాతం భక్తులు ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి చేరుకుంటున్నారు. సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లే భక్తులు పార్కింగ్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి కొండపైకి మొదటి ఘాట్‌ రోడ్‌ మీదుగా ఆటోలను అనుమతిస్తున్నారు. యాదాద్రి దేవస్థానం పాత ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z