టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరి వివాహం జరగనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. నితిన్ కొంతకాలంగా ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్నారట. దీంతో నితిన్ కుటుంబసభ్యులు తర్వలోనే వీరిద్దరికి వివాహం చేయాలని భావిస్తున్నారట. ఈ తరుణంలో వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనుందట. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం దుబాయ్లో జరగొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి రుమార్స్పై నితిన్ స్పందించాల్సి ఉంది.ప్రస్తుతం నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
విదేశాల్లో ప్రేమ వివాహం
Related tags :