🕑 Published: June 11, 2026 at 08:10 AM CST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలను అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆస్టిన్ ఎన్నారై తెదేపా అధ్యక్షుడు లెనిన్ ఎర్రం, ఉపాధ్యక్షుడు రవి కొత్తా, స్థానిక నాయకులు ఉమాపతి తుమ్మలలు ప్రసంగించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం అజరామరం అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
