Business

బాధ్యతగా ₹70కోట్లు

amitabh pays 70crores as income tax

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ రూ.70 కోట్లు పన్ను చెల్లించినట్లు ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఈ మొత్తాన్ని చెల్లించారు. ఆయన ఇటీవలే బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 2,084 మంది రైతులు రుణాలు మాఫీ చేయించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పుల్వామా బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశారు. సకాలంలో పన్ను చెల్లించి బిగ్‌బీ ఆదర్శంగా నిలిచారని ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ‘బద్లా’ చిత్రంలో శుభారంభాన్ని అందుకున్న బిగ్‌బీ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘సైరా’, బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’, తమిళంలో మరో చిత్రం చేస్తున్నారు.