ScienceAndTech

ఏసీ హెల్మెట్లు వచ్చేస్తున్నాయి

ac helmets to enter indian market

వేసవి కాలంలో బైక్‌పై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. అయితే వేసవి కాలంలో కూడా బైక్‌పై హాయిగా వెళ్లేందుకు ఒక సౌకర్యం అందుబాటులో ఉంది. అదే ఏసీ హెల్మెట్..!ఇప్పుడు మార్కెట్‌లోకి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్ అనే ఒక చిన్న పరికరం అందుబాటులో ఉంది. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్‌ను హెల్మెట్‌కు తగిలించుకుంటే ఏసీ హెల్మెట్ అవుతుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్.. హెల్మెట్ లోపలి గాలిని చల్లగా ఉంచుతుంది. దుమ్ము కూడా లోనికి రానివ్వదు.హెల్మెట్ కూలర్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే హెల్మెట్‌లో చిన్న వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది.ఫుల్ ఫేస్ హెల్మెట్ ముందు భాగంలో కిందివైపు ఈ పరికరాన్ని అమర్చుకోవలసి ఉంటుంది. ఇందులోని ఫ్యాన్ గాలిని వాటర్ ఫిల్టర్ గుండా లోనికి పంపిస్తుంది. ఫిల్టర్ ఎక్కువసేపు తేమను అలాగే పట్టిఉంచుకోగలదు. అందువల్ల రైడ్‌కు బయలుదేరిన ప్రతిసారి రిజర్వాయర్‌ను నీటితో నింపుకోవలసిన అవసరం లేదు. వేగ హెల్మెట్ డీలర్‌షిప్స్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బ్లూస్నాప్ హెల్మెట్‌ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.2,299.అంటే ఏసీ ఎలా పనిచేస్తుందో.. అలాగే ఇది కూడా పనిచేస్తుంది.ఫుల్ ఫేస్ హెల్మెట్ ముందు భాగంలో కిందివైపు ఈ పరికరాన్ని అమర్చుకోవలసి ఉంటుంది. ఇందులోని ఫ్యాన్ గాలిని వాటర్ ఫిల్టర్ గుండా లోనికి పంపిస్తుంది.ఫిల్టర్ ఎక్కువసేపు తేమను అలాగే పట్టిఉంచుకోగలదు. అందువల్ల రైడ్‌కు బయలుదేరిన ప్రతిసారి రిజర్వాయర్‌ను నీటితో నింపుకోవలసిన అవసరం లేదు. వేగ హెల్మెట్ డీలర్‌షిప్స్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బ్లూస్నాప్ హెల్మెట్‌ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.2,299.