ఆబ్కారీ శాఖ విజిలెన్స్ అధికారులు ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో రూ. కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఆబ్కారీ శాఖ అధికారుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆబ్కారీ శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో రెండు వాహనాల్లో దాదాపు 508 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిలో ఒకరు జహీరాబాద్‌కు చెందిన వీరుశెట్టి, మరొకరు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బాల్కికి చెందిన పుత్‌రాజ్ నీలారం మెట్రాజ్‌గా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ. కోటికిపైగా ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు.
పటాన్‌చెరులో కోటి రూపాయిల గంజాయి పట్టివేత
Related tags :