NRI-NRT

నాట్స్ సంబరాల్లో తెలుగు సాహిత్యానికి పెద్దపీట

nats 6th america telugu sambaralu irving may 2019 telugu literary meet

ఇర్వింగ్ వేదికగా మే 24,25,26 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 6వ అమెరిక తెలుగు సంబరాల్లో సాహితీవేత్తలు సందడి చేయనున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అవధాని మీగడ రామలింగస్వామి, గేయరచయితలు రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, రచయితలు యర్రాప్రగడ రామకృష్ణ, వంగూరి చిట్టెన్‌రాజు తదితరులు ఈ సంబరాల్లో ఏర్పాటు చేసిన సాహిత్యవేదికలో సందడి చేస్తారని సాహిత్యవేదిక సమన్వయకర్త మల్లవరపు అనంత్ పేర్కొన్నారు. ఈసారి సంబరాల్లో అన్ని రంగాలకు విశేషమైన ప్రాధాన్యత కల్పించామని, ఏర్పాట్లు ఘనంగా చేశామని, ప్రవాసులు ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారని సభల సమన్వయకర్త కంచర్ల కిషోర్, నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు, నాట్స్ బోర్డు చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్‌లు వెల్లడించారు.