DailyDose

భాజపా నేతల కీలక భేటీ-తాజావార్తలు–05/21

May 21 2019 - Daily Breaking News By TNILIVE In Telugu

* భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, భాజపా కీలక నేతలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలకంగా చర్చించనున్నారు
*శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మైనంపల్లి హన్మంతరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈనెల 28వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 29న పరిశీలన…. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈనెల 31. జూన్ 7న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.
* పొలాండ్‌కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగశిశువులున్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జన్మించడం పోలాండ్‌ దేశంలోనే ప్రథమం. సోమవారం క్రకౌ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆ మహిళ ఆరుగురి పిల్లలకు జన్మనివ్వగా.. ఒక్కొక్కరు కిలో బరువు ఉన్నారు. దీంతో వైద్యులు వారిని ఇన్‌క్యూబెటర్స్‌లో ఉంచారు. * తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారాయి. తెలంగాణవ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు బెంబేలెత్తుతున్నారు. కూలీలు, కార్మికులు, ఉద్యో గులు వడదెబ్బల బారినపడుతున్నారు.
* ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల నేపథ్యంలో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు.. నేడు నష్టాలను చవిచూశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కొన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 380 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 11,800 మార్క్‌ ను కోల్పోయింది.
* ఈ నెల 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు* నెలన్నరపాటు సాగిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ఫ్యూయల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? గత రెండు నెలల్లో ఎదుర్కొన్న నష్టాలను పూడ్చుకునేందుకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
* మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వీర్ భూమిలో కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. *భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ వ వర్థంతి సందర్భంగా ఇవాళ ట్విటర్ వేదికగా ప్రధాని స్పందిస్తూ.. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు…అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతూర్పు యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకాగాంధీ తదితరులు పుష్పాంజలి ఘటించారు
*నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) సీ46 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 4.30గంటలకు ప్రారంభమయింది. కౌంట్‌డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 615కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. దీని కాలపరిమితి ఐదేళ్లు. రాకెట్‌ ప్రయోగాన్ని ముందుగా బుధవారం ఉదయం 5.27 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డు రానుండడాన్ని గుర్తించి మూడు నిమిషాల అలస్యంగా 5.30 గంటలకు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
*ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కొనుగోళ్లలో కనీస నిబంధనలకు తూట్లు పొడిచారు. తప్పనిసరిగా పాటించాల్సిన ఈ-టెండరు విధానానికి తిలోదకాలిచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన బినామీ సంస్థలకు మందుల టెండర్లను కట్టబెట్టారు.
*తిరుచ్చి నుంచి సింగపూర్‌ బయలుదేరిన విమానంలో ఏర్పడిన విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దించడంతో అందులో ప్రయాణించిన 170 మంది సురక్షితంగా బయటపడ్డారు. తిరుచ్చి నుంచి సింగపూర్‌కు సోమవారం ఉదయం ప్రైవేటు విమానం 170 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
*ఉష్ణం ఉగ్రరూపం దాల్చి రాష్ట్రాన్ని గడగడలాడిస్తోంది. ఉదయం 11 గంటలు దాటిందంటే చాలు కాలు బయటపెట్టేందుకు ఎవ్వరూ సాహసం చేయలేకపోతున్నారు. ఈనెల 24వతేదీ నుంచి రోహిణి కార్తె ప్రవేశించనుంది. ఈనేపథ్యంలో మరింత తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయం 11 గంటల తర్వాత ఎండ వేడిమి తీవ్రమవుతోంది. సాయంత్రం 4 గంటలు దాటినా భానుడి తీవ్రత తగ్గడంలేదు.
*రాష్ట్రంలో రాత్రిళ్లు కూడా వేడి సెగలు తగ్గడం లేదు. అత్యధికంగా ఆదివారం రాత్రి ఉష్ణోగ్రత హైదరాబాద్‌లో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి. దీంతో గాలిలో తేమ ఆవిరై తీవ్ర ఉక్కపోతగా ఉంటోంది.
*గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి ఉన్న అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆనకట్ట ఎత్తు పెంచడంతో పాటు బ్యారేజీగా మార్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తోంది.
*ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఏడుదశల్లో జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 67.11 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికలకంటే 0.61 శాతం అధికం. 2014లో 66.40 శాతం, 2009లో 56.90 శాతం పోలింగ్‌ నమోదైంది.
* తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను చారిత్రక ప్రదేశంలో నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ, క్రీడలు, పురావస్తు శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ సన్నాహాలను ఆయన పరిశీలించారు.
*ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 7వ తేదీ నుంచి 14 వరకు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన పరీక్షలు జూన్‌ 12తోనే ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.
*రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురుకుల సెట్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం విడుదల చేశారు. 2019-20 విద్యాసంవత్సరానికి 47,740 సీట్లకుగాను 1,35,608 మంది పరీక్ష రాశారని తెలిపారు.
*తిరుచ్చి నుంచి సింగపూర్‌ బయలుదేరిన విమానంలో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దించడంతో అందులో ప్రయాణించిన 170 మంది సురక్షితంగా బయటపడ్డారు.
*న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నిర్వహించిన లాసెట్‌-2019 పరీక్షకు 77శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని సెట్‌ కన్వీనర్‌ ప్రొ.జి.బి.రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షను ఉదయం 11గంటల నుంచి 12.30గంటల వరకు నిర్వహించారు.
*తెలంగాణలోని ఎంసీఏ, ఎంబీఏలలో 2019-20 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం..ఈనెల 23, 24 తేదీల్లో ఉమ్మడి రాష్ట్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు జరుగుతాయి. వివరాలను టీఎస్‌ ఐసెట్‌-2019 కన్వీనర్‌, కేయూ సీనియర్‌ ఆచార్యుడు సీహెచ్‌.రాజేశం సోమవారం హన్మకొండలో తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తం 49,465 మంది దరఖాస్తు చేసుకున్నారని; వీరిలో తెలంగాణ 47,511 మంది, ఏపీలో 1,954 మంది ఉన్నారని పేర్కొన్నారు.
*రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 68 పురపాలక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ ఉద్యోగులను..ఇక పురపాలక శాఖలోనే విలీనం చేయనున్నారు. 557 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇతర రెగ్యులర్‌ ఉద్యోగులను విలీనం చేయాలంటూ పురపాలకశాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి ప్రతిపాదనలు పంపారు. అనంతరం మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-1 ఉద్యోగులు 99మంది, గ్రేడ్‌-2 కార్యదర్శులు/సీనియర్‌ అసిస్టెంట్లు ఏడుగురు, గ్రేడ్‌-3 కార్యదర్శులు/జూనియర్‌ అసిస్టెంట్లు 63మంది, గ్రేడ్‌-4కార్యదర్శులు/బిల్‌కలెక్టర్లు 71మంది, దిగువ కేడర్‌లోని రెగ్యులర్‌ ఉద్యోగులు 317 మందిని, అంతేకాక మరికొందరిని పురపాలకశాఖలో కలపనున్నారు.
* వేసవి రద్దీ కారణంగా, హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రైలు (నంబరు 07053) 26వ తేదీన హైదరాబాద్‌లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. 27వ తేదీన రైలు కాకినాడలో రాత్రి 8.10కు బయల్దేరి మరురోజు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.
*వేసవి రద్దీ కారణంగా, హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రైలు (నంబరు 07053) 26వ తేదీన హైదరాబాద్‌లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. 27వ తేదీన రైలు కాకినాడలో రాత్రి 8.10కు బయల్దేరి మరురోజు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది. ఈ రైళ్లు వరంగల్‌, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, రాజమండ్రి స్టేషన్‌లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన పేర్కొంది.
*సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని, ఈ నేపథ్యంలో జూన్‌ 5 తర్వాత సమ్మె చేసేందుకు నిర్ణయించామని ఏపీ మున్సిపల్‌ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు తెలిపారు.
*ఇంటర్‌ అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 7వ తేదీ నుంచి 14 వరకు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన పరీక్షలు జూన్‌ 12తోనే ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.
*ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐపీల్ అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
*బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయి పై ప్రముఖ నటుడు వివేక్ ఓబెరాయి త్విట్టార్ లో పోస్టు చేసిన మిమ్ పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
*సుదిర్మన్ కప్ లో తోలి పోరుకు భారత్ సిద్దమైంది. మంగళవారం మలేసియాలో జరిగే మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలో దిగుతుంది. గ్రూప్-1డీలో భారత్ తో పాటు చైనా, మలేసియా, బరిలో ఉన్నాయి. ఆదివారం చైనా 5-0తో మలేసియాను చిత్తచేసింది. మంగళవారం మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడితే మలేసియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మలేసియా చేతిలో భారత్ ఓడితే బుధవారం జరిగే పోరులో చైనాపై తప్పక గెలవాల్సి ఉంటుంది. సింధు, సైనా నెహ్వాల్, కిదాంబీ శ్రీకాంత్, సమీర్ వర్మతో సహా పదమూడు మంది సభ్యుల భారత జట్టు పటిష్టంగా ఉంది.
*ప్రపంచ కప్ లో తలపడే పాకిస్థాన్ జట్టులో లెఫ్టార్మ్ పేస్ ద్వయం, మహమద్ అమీర్, వహాబ్ రియాజ్ తో పాటు అసీఫ్ అలీ చోటు సంపాదించారు.