DailyDose

మోదీ ప్రభంజనం మార్కెట్లు జూమ్‌-వాణిజ్య-05/23

May 23 2019 - Daily Business News - Indian stock markets are happy

* సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. తద్వారా మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 672 పాయింట్లు దూసుకెళ్లి 39,790 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ సైతం లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. ప్రస్తుతం 200 పాయింట్లు లాభంతో 11,931 వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాలూ లాభాల్లో దూసుకుపోతున్నాయి.
* ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల సంక్షోభం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం ముంబయిలో దాడులు నిర్వహించింది.
*సాగర్‌ సిమెంట్స్‌ గత ఆర్థిక సంవత్సరానికి వాటాదార్లకు 25 శాతం చొప్పున (రూ.10 ముఖ విలువ కల ఒక్కో షేర్‌కు రూ.2.50 చొప్పున) డివిడెండ్‌ చెల్లించనుంది.
* ఔషధ సంస్థ సిప్లా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.357.68 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.991 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.మొండి బకాయిలకు రూ.5,550 కోట్ల కేటాయింపులు చేసింది.
*హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.20.16 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రూ.360.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*కొత్త ప్రభుత్వానికి 100 రోజుల అజెండాను ఆర్థికశాఖ రూపొందించింది. రాబోయే కొద్దిరోజుల్లో అధికారం చేపట్టే ప్రభుత్వానికి, 100 రోజుల ప్రణాళిక తయారు చేయాలని అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలను ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఆదేశించింది.
*అధికశాతం ఎగ్జిట్‌ పోల్స్‌ భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి.
*రాజకీయ అనిశ్చితికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలు ఎవరో తెలిసిపోనుంది. మార్కెట్‌లో మదుపర్లు సైతం సిద్ధమయ్యారు.
*బ్రిటన్ లో రెండో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ బ్రిటిష్ స్టీల్ పతనబాట పట్టింది. సంస్థను గట్టెక్కించేందుకు అవసరమైన నిధులను సమకూర్చే విషయంపై ప్రభుత్వం, యాజమాన్యం మధ్య జరిగిన తుది చర్చలు విఫలమయ్యాయి.