DailyDose

ఎన్‌టీఆర్‌కు చంద్రబాబు నివాళి-తాజావార్తలు-05/28

Chandrababu offers tribute to NTR

* ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు చంద్రబాబు దంపతులు హాజరై, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తనయ భువనేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేయగా, చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
* నిన్నటివరకు చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్.. ఎట్టకేలకు టీడీపీ పార్టీని గద్దె దించి సీఎం సీటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. జగన్ ఆంధ్రరాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మే 30వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావలిసిందిగా కోరుతూ చంద్రబాబుకు జగన్ ఫోన్ చేశారు.
* ఎన్‌టిఆర్ జయంతి వేడుకల్లో స్వల్పవాగ్వాదం చోటుచేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా ఆయన భార్య లక్ష్మీ పార్వతి నివాళులర్పించేందుకు ఎన్టిఆర్ ఘాట్ కు వచ్చారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతుండగా టిడిపి కార్యకర్తలు అడ్డుతగిలారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ఓటమితో ఎన్‌టిఆర్ ఆత్మ శాంతించిందని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యనించింది. ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద రాజకీయాలు మాట్లాడితే బాగుండదని లక్ష్మీ పార్వతికి టిడిపి కార్యకర్తలు, బాబు అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. అభిమానులు ఆగ్రహంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జై చంద్రబాబు, జైటిడిపి, ఎన్‌టిఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. దీంతో లక్ష్మీ పార్వతి ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగారు.
* ఈ నెల 30న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
* ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. కాగా ఈ నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే అందరు ముఖ్య నేతలకు పదవులు కట్టబెట్టే పనిలో నిమగ్నమై పోయారు పార్టీ అధిష్టానం.కాగా ఇప్పటికే మంత్రుల పదవులపై జగన్ ఒక అభిప్రాయంలో ఉన్నారని, జగన్ తో పాటే వారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.నామినేటెడ్ పదవులలో కీలకమైన, ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ కోసం పలువురు నేతలు చాలా ఆసక్తిగా ఉన్నారు.
* 2024 లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అందుకు అవినీతి రహితంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు..పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు 2014లో అధికారంలోకి రాగానే ఆవురావురుమంటూ ఎగబడ్డారు. ప్రభుత్వ పనులు ఇసుక మైనింగ్ లపై పడి దోచుకున్నారన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి..
* రాయలసీమ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడుమీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంగా రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందన్నారు.
* తెలుగుదేశం పార్టీ హయాంలో నామినేటెడ్‌ పదవులు పొందిన వారిని ఏ క్షణాన అయినా తొలగించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు భావిస్తోన్నాయి. గ్రంథాలయాలు, నీటిపారుదల సంఘాలు, దేవస్థానాలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లని తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడతాయని పేర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు నామినేటెడ్‌ కమిటీల పాలకవర్గాలు సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంపై అభ్యంతరం తెలపడం ప్రారంభించారు.
* సుప్రీంకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాష్ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన రవిప్రకాష్ నేడు ఈ పిటిషన్ పై విచారించునున్న సుప్రీంకోర్టు.ఏ క్షణానైనా పాలకవర్గాల తొలగింపు ఉత్తర్వులు
* క్రికెట్‌ పండగకు ఇంకెన్నో రోజులు లేదు. విశ్వవ్యాప్తంగా అభిమానుల చూపు ఇంగ్లాండ్‌ వైపే. నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్‌ను తనివితీరా ఆస్వాదించడానికి సిద్ధమైపోతున్నారు. ముఖ్యంగా కొన్ని పోరాటాలు ఆసక్తి రేపుతున్నాయి. 46 రోజుల సుదీర్ఘ టోర్నీలో ప్రతి మ్యాచూ ముఖ్యమైందే. సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్
* తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మంటున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరమైన వడగాల్పులు , ఉక్కపోతతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని రేణిగుంటలో అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
* తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ సమాధి వద్ద పూలుజల్లి నివాళులర్పించారు.
* ఇండియాలో ఇంటర్నెట్‌ స్పీడు తగ్గుతోంది. ఒక్లా కంపెనీ నిర్వహించిన స్పీడ్‌ టెస్టులో భారత్‌ ర్యాంక్‌ దారుణంగా పడిపోయింది. ప్రపంచ ర్యాంకింగ్‌ లో మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ లో 109 నుండి 121 వ ర్యాంక్‌ కు పడిపోయింది. బ్రాడ్‌ బాండ్‌ సేవల్లో ప్రపంచ వ్యాప్తంగా 68 వ ర్యాంక్‌ ను దక్కించుకుంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ లో నార్వే 65.41 ఎంబిపిఎస్‌ తో టాప్‌ ప్లేస్‌ లో ఉండగా, బ్రాడ్‌ బాండ్‌ సేవల్లో సింగపూర్‌ 197.50 ఎంబిపిఎస్‌ తో టాప్‌ లో దక్కించుకుంది.
* ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు, ట్రాఫిక్‌ డీసీపీ, పోలీసు అధికారులు సహా కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. తాము తీసుకుంటున్న చర్యలను ఉన్నతాధికారులు జగన్‌కు వివరించారు
* సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా భారీ విజయం నమోదు చేసిన మే 23ను ‘మోదీ దివాస్‌’గా జరుపుకోవాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ పిలుపునిచ్చారు.
* ఓ మహిళా న్యాయమూర్తి సహా నలుగురు కొత్త జడ్జీలు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌, జస్టిస్‌ రజనీశ్‌ భట్నాగర్‌, జస్టిస్‌ ఆశా మేనన్‌, జస్టిస్‌ బ్రిజేష్‌ సేథీలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మేనన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రభుత్వ ఆమోదం మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరిని నియమించారు. వీరితో దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 40కి చేరగా.. వారిలో 8 మంది మహిళా న్యాయమూర్తులు. దిల్లీ హైకోర్టుకు 60 జడ్జి పోస్టులు మంజూరు కాగా ఇంకా 20 మంది కొరత ఉంది. కొత్తగా నియమితులైన వారంతా దిల్లీ జిల్లా కోర్టుల్లో న్యాయాధికారులుగా పనిచేసిన వారే.*శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు దక్కింది. పారదర్శకమైన క్రమశిక్షణతో కూడిన పాలన అందించినందుకు గానూ ఈ గుర్తింపు లభించిందని ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ తెలిపారు.
*ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రేవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ అశోక్ ఆయన భార్య శ్రీలక్ష్మి సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు. ప్రజల వ్యక్తిగత ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ చోరీ చేసి దుర్వినియోగం పాల్పడిందని డాటా విశ్లేషకుడు లోకేస్వర్ రెడ్డి మార్చిలో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన అశోక్ ఆయన భార్య మరో ఇద్దరు ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టులో ముందస్తు బాయిల్ కు పిటిషన్లు దాఖలు చేశారు.
*వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని త్రిపురకు చెందిన కపిలేస్వరానందగిరి స్వామీ చెప్పారు. సోమవరం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2024 తర్వాత కూడా జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని త్వరలో ఆయన్ను కలిసి ఆశీర్వచనాలు అందిస్తా నాయి తెలిపారు.
*తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్‌, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి, వ్యవస్థ అని, సమాజానికి సేవ చేయాలి, మార్పు తేవాలనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు అన్నారు.
*నగదు అక్రమ చలామణి కేసులో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు దిల్లీ హైకోర్టు మంజూరుచేసిన ముందస్తు బెయిల్‌ రద్దయ్యేలా ఉంది! విచారణకు ఆయన సరిగా సహకరించట్లేదని, కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు హైకోర్టుకు నివేదించారు.
*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తాలూకు ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే మండల, జిల్లా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌ పదవుల పరోక్ష ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తికానుంది. అందుకు అనుగుణంగా ‘ప్రత్యేక సమావేశాలు’ నిర్వహించుకునేందుకు వీలుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టంలో గవర్నర్‌ ఆర్డినెన్సు ద్వారా ప్రభుత్వం సవరణ తెచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ సాంకేతిక పొరపాట్లే కాదు.. జవాబుపత్రాల మూల్యాంకనంలోనూ భారీ నిర్లక్ష్యం ఇంటర్‌ విద్యార్థులకు శాపంగా మారింది. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో తప్పిన 3.82 లక్షల మందిలో 1,137 మంది ఉత్తీర్ణులు కావడం ఇంటర్‌ మూల్యాంకనం తీరుకు దర్పణం పడుతోంది.
*భానుడి ప్రచండ ఉష్ణోగ్రతలతో పగటిపూట సెగలు, ఉక్కపోతల మధ్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కోల్వాయి, ఎండపల్లి రాజారాంపల్లిలో పగటి ఉష్ణోగ్రత 47.9 డిగ్రీలుగా నమోదైంది.
*తెలంగాణలో భారీఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమైంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు చేరింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే వీలుంది.
*ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగాధిపతిగా ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర నియమితులుకానున్నారు. ఆయన 1999 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్‌లో ఉన్న ఆయన…హైదరాబాద్‌ రీజియన్‌ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.
*శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌వో) గుర్తింపు దక్కింది.
*విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ ఓటమిని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త ఉద్వేగానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు.
*భారత పత్తి శాస్త్రవేత్తల వార్షిక సమావేశం ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు లాంఫాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరగనుంది. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ), భారత వ్యవసాయ పరిశోధన కమిటీ (ఐసీఏఆర్‌) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తునట్లు ఆంగ్రూ ఉపకులపతి డాక్టర్‌ వి.దామోదరనాయుడు పేర్కొన్నారు.
*సకాలంలో తాగునీరు అందక వేలాది బాయిలర్‌ కోళ్లు సోమవారం మృత్యువాత పడడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. సుమారు రూ.లక్షల వరకు నష్టం వాటిల్లిందనిదీనికి సంబంధించిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు
*ఆంధ్రప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పనిచేయడానికి అనుమతించాలని కోరుతూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏపీకి చెందిన ఆమె 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించగా.. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఓబులాపురం గనుల కేటాయింపు వ్యవహారంలో శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో జైలుకి వెళ్లి వచ్చారు. ఈ అభియోగాల కారణంగా ఇటీవల పదోన్నతి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో పనిచేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
*హైదరాబాద్‌ జిల్లాల్లో నూతన కలెక్టరేట్ల నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. ఏడాది లోపు పనులు పూర్తి చేసే దిశగా కసరత్తు ముమ్మరమైంది. గతేడాది కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణ్‌పేట జిల్లాల్లో మాత్రం భవన సముదాయాలు ఎక్కడ నిర్మించాలనే అంశం ఇంకా కొలిక్కి రాలేదు.
*ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు ఒకే విమానంలో విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. అయితే సీఎం కేసీఆర్‌ దిల్లీకి వెళ్లే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
*కొత్త లోక్‌సభ వచ్చేనెల 6న కొలువుదీరనుంది. జూన్‌ 6 నుంచి 15 వరకు 17వ తొలి సమావేశాలు జరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ గురువారం ప్రధానిగా మోదీతో, మంత్రులుగా మరికొందరు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. 31న మంత్రివర్గం భేటీ అవుతుంది. లోక్‌సభ సమావేశాలను ఎప్పట్నుంచి ఎప్పటివరకు నిర్వహించాలన్నది ఆ సందర్భంగా ఖరారు చేస్తారు. జూన్‌ 6న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే అవకాశముంది. అదే రోజు ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. లోక్‌సభ సభ్యులందరితో ఆయన ప్రమాణం చేయిస్తారు. 10న స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది’ అని ఆ వర్గాలు తెలిపాయి.
*ఈనెల 31న జరగనున్న ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తటస్థ వైఖరి అవలంబిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు.
*ఎన్డీయే ప్రభుత్వం 2019-20 సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ ఏడాది జులై రెండో వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది. ‘‘ప్రస్తుతానికి తేదీ ఖరారు కాలేదు. దానికి ఇంకా సమయముంది. ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అయితే, జులై 10వ తేదీకి కాస్త అటో ఇటో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి’’ అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.
*వ్యాయాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పీఈసెట్‌లో ఉత్తమ ర్యాంకులను అమ్మాయిలే దక్కించుకున్నారు. వారిలోనూ ఎక్కువ మంది గిరిజన యువతులు కావడం విశేషం.
*ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఎండీ అశోక్‌, ఆయన భార్య శ్రీలక్ష్మి సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
*తెలంగాణ మంత్రిమండలి సమావేశం వచ్చే నెల జూన్‌ మొదటి వారంలో జరగనుంది. ఈ నెల 28న సమావేశం నిర్వహించాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలను రూపొందించి మంత్రిమండలి ఆమోదం తీసుకోవాలని సీఎం యోచిస్తున్నారు.
*దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌(సీఆర్‌పీపీ) సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ నూతన చక్రవర్తి నరుహితోను సతీసమేతంగా కలిశారు. రాజభవన వర్గాలు ఎర్రతివాచీతో ట్రంప్నకు స్వాగతం పలికాయి. చక్రవర్తిని కలిసిన ప్రపంచ నేతల్లో ట్రంప్ మొదటివారు. ట్రంప్తో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఉన్నారు. కలిసిన వెంటనే ఇరువురు సుప్రిమోలు కరచాలనం చేసి ఒకరినొకరు అభినందించుకున్నారు.మే 1న పాత చక్రవర్తి అకిహితో బాధ్యతలను కుమారుడు నరుహితోకు అప్పగించారు. నూతన చక్రవర్తి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జపనీయులు అందమైన సామరస్యం అనే అర్థం వచ్చే ‘రీవా శకం’గా పిలుస్తున్నారు
* విశాఖ‌ప‌ట్ట‌ణంలో కిడ్నీ రాకెట్‌కు పాల్ప‌డిన శ్ర‌ద్దా హాస్ప‌ట‌ల్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్‌ను పోలీసులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు.
* ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పని చేస్తున్నారు. కర్తవ్య నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్‌కు పేరుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడానికి మరో 15 రోజులు పట్టే సమయం ఉందని తెలుస్తోంది.
* జపాన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జపాన్‌ నూతన చక్రవర్తి నరూహిటోను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చక్రవర్తి పీఠాన్ని నరూహిటో అధిష్ఠించిన అనంతరం ఆయనను తొలిసారిగా కలుసుకున్న అంతర్జాతీయ నేతగా ట్రంప్‌ నిలిచారు. సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఇంపీరియల్‌ ప్యాలెస్‌కు చేరుకున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు రెడ్‌కార్పెట్‌పై స్వాగతం లభించింది. ట్రంప్‌ దంపతులకు సాదర స్వాగతం పలికిన నరూహిటో దంపతులు అనంతరం వారితో భేటీ అయ్యారు.
*రాష్ట్రంలో భానుడు భాగ్గుమంతున్నాడు ఉదయం నుంచే నిప్పులు కురిపిస్తున్నాడు. సాధారణ కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకి రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం ఆరు దాటితే ఎండలు చల్లారడం లేదు. మరోవైపు రాత్రివేళల్లో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ పడవ తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
* తొలి వామప్‌ మ్యాచ్‌ లో విఫలమైనా..టీమిండియా బ్యాటింగ్‌ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అసవరం లేదని ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. రాబోయే మ్యాచ్‌ ల్లో ఈ తరహా పిచ్‌ లు ఎదురుకావని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఇంగ్లిష్‌ వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి.
* జూన్8న మృగశిరకార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేపమందు పంపిణీకి ఈ ఏడాది కూడా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.జూన్ 8 ఉదయం 8.00 గంటలకు చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమై జూన్ 9 ఉదయం 8.00 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది.చేప ప్రసాదం తీసుకునేవారు మూడు గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోరాదు, తరువాత గంటన్నర వరకు ఏదీ తినరాదన్నారు.
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి రాజగోపాల్ పై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన తప్పుడు సర్వేల కారణంగా చాలామంది నష్టపోయారని మురళీకృష్ణ తెలిపారు. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
* సౌతాఫ్రికాలోని పెరూలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. ఈ భూకంప ధాటికి ఒకరు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని డారియో మునోజ్(48)గా అక్కడి అధికారులు గుర్తించారు. 130 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇందులో స్కూళ్లు, ఆస్పత్రులు, చర్చిలు ఉన్నాయని తెలిపారు. 62 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 1250 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
* భారత ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత న‌రేంద్ర‌మోదీ ద‌క్షిణాసియా దేశం మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. జూన్ 7-8వ తేదీల్లో ఈ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఇదే కావ‌డం విశేషం. జూన్ మొద‌టివారంలో భార‌త ప్ర‌ధాని మాల్దీవుల రాజ‌ధాని మాలే రానున్నార‌ని ఆదేశ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై ఆదేశ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు.
* ఇవాళ భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి. ఈసందర్భంగా ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నివాళులర్పించారు.
నెహ్రూ సమాధి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.
* 17వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకు జరిగే అవకాశం ఉంది. మే 30న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం 31న కొత్త మంత్రివర్గం భేటీ కానుంది. అదే రోజు పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
* ప్రభుత్వం మారిన నేపథ్యంలో అన్ని నామినేటెడ్ సంస్థల ఛైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తుండగా…. టిటిడి పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా హాడావుడిగా సమావేశం నిర్వహించేందుకు తహతహలాడుతోంది.28.05.2019న తిరుమలలో బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఇటీవల ఎన్నికల సందర్భంగా తలెత్తిన బంగారు వివాదంలో టిటిడి అధికారులకు క్లీన్ చిట్ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
* జమ్మూ – రాజౌరీ మరియు ఫూంచ్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం రోడ్డు ఓపెనింగ్‌ పార్టీ దళాలు హైవేపై వెళ్తున్నాయి. కల్లార్‌ చౌక్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను బలగాలు గుర్తించాయి.
* సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి బ్రిటన్ ప్రధాని థెరిసా మే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను అధికారులు సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. ఇరు దేశాలకు సంబంధించి పలు విషయాలపై మోదీతో మే చర్చించారని బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.
* కన్నడ కంఠీరవుడు, దివంగత రాజ్‌కుమార్‌ ఇంటిలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. రాఘవేంద్ర రాజ్‌ కుమార్‌ కుమారుడు యువరాజ్‌ కుమార్‌ వివాహం మైసూరుకు చెందిన శ్రీదేవితో ఆదివారం బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో వైభవంగా జరిగింది. వివాహానికి సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శనివారం రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ ఇంటిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెప్షన్‌లో తమిళ, తెలుగు, హిందీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
* సంగారెడ్డి పట్టణ శివారులో ఆదివారం సాయంత్రం ఆబ్కారి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 111కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. దాని విలువ రూ.10లక్షలు ఉంటుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఆబ్కారి శాఖ ఉప కమిషనర్ కేఏబీ శాస్త్రీ తెలిపారు. ఈ తనిఖీల్లో రెండు వాహనాలతో పాటు ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు.
* రాష్ట్రంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలుచిత్తూరు జిల్లా పిచ్చాటూరులో అత్య‌ధికంగా 45.99 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌న‌గ‌రి 45.86, ఏర్పేడు 45.69, నిండ్ర‌లో 45.64, శ్రీరంగ‌రాజ‌పురం 45.33, వ‌డ‌మాల‌పేట‌లో 45.30, చంద్ర‌గిరి 45.17 డిగ్రీలు న‌మోదునెల్లూరు జిల్లా రాపూరులో 45.94 డిగ్రీలు, అనంత‌సాగ‌రం 45.68 డిగ్రీలు న‌మోదుప్ర‌కాశం జిల్లా హ‌నుమంతునిపాడులో 45.24, చంద్ర‌శేఖ‌ర‌పురం 45.33, ముండ్ల‌మూరులో 45.23, ఎర్ర‌గొండ‌పాలెంలో 45.08 డిగ్రీల న‌మోదు20 ప్రాంతాల్లో 45 నుండి 47 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు153 ప్రాంతాల్లో 43 నుండి 44 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ‌త‌లు న‌మోదు-రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం
* అమరావతివిశాఖ‌ప‌ట్ట‌ణంలో కిడ్నీ రాకెట్‌కు పాల్ప‌డిన శ్ర‌ద్దా హాస్ప‌ట‌ల్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్‌ను పోలీసులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు. శ్ర‌ద్ధా హాస్ప‌ట‌ల్ అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో కిడ్నీ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
* యాదాద్రి కొండపైన పలు దుకాణాలలో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు. అధిక ధరలకు వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో, తనిఖీలు చేసిన అధికారులు. అధిక ధరలకు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న, నాలుగు దుకాణాలపై కేసు నమోదు చేసిన, తూనికలు కొలతల శాఖ అధికారులు.
* ముఖ్యమంత్రిగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ గంగా ప్ర‌సాద్ ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌ట‌క్‌లోని ప‌ల్జోర్ స్టేడియంలో ఈ వేడుక జ‌రిగింది.
*ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ లో చైనా పదకొండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనా 3-0తో జపాన్ పై విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్ తరువాత మహిళల సింగిల్స్ లో జపాన్ కు చైనా చిత్తూ చేసింది.
*ఆధునిక ధాయిలాండ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా వెలుగొందిన ఆదేశ మాజీ ప్రధాని ప్రేమ్ తిన్సులా నోండా 98 ఏళ్ల వయసులో ఆదివారం బ్యాంకాక్ లో ఓ ఆసుపత్రిలో సన్నిహిత సంబంధాలున్న ప్రేమ సైన్యంలో ఆర్మీ జనరల్ గా పని చేశారు. 1980 నుంచి 88 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. మాజీ రాజు భూమిబోల్ ఆద్యుల దేజ్ కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సైన్యం- రాజకుటుంబం మధ్య సంబందాలు బలోపేతం చేయడంలో ప్రేమ్ పాత్ర ఎనలేనిది.
*వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ లోనూ ప్రకటనలు గుప్పించాలని పేస్ బుక్ నిర్ణయించింది. వాట్సాప్ స్టేటస్ పేజీలో మాత్రమే మొదట ప్రకటనలు అనుమతించాలని నెదర్లండ్స్ లో ఇటీవల జరిగిన పేస్ బుక్ మార్కెటింగ్ సమావేశంలో నిర్ణయించినట్లు ఒలీవార్ పాంతివిల్లీ అనే ఉద్యోగి ఒకరు ట్విట్ చేశారు. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ లో వినియోగదారులు టెక్స్ట్ , ఫోటోలు, వీడియోలు, జిప్ లు షేర్ చేసుకోవచ్చు.
*అరుణ్ జైట్లీ ఆరోగ్యం క్షి నించిందన్న వార్తలును ప్రభుత్వం ఖండించింది. ఇవి నిరాధార సమాచారమని కేవలం వదంతులని పేర్కొంటూ ప్రభుత్వ అధికార ప్రతినిధి సీతంశు కర్ ట్విట్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 66 ఏళ్ల జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన చికిత్స నిమిత్తం అమెరికాకో, బ్రిటన్ కో వెళ్ళాల్సి ఉంటుంది.
*పతంజలి గ్రూపును యూఎన్‌ఎస్‌డీజీ హెల్త్‌కేర్‌ పురస్కారం వరించింది. ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్‌ఎస్‌డీజీ ఏటా ఈ అవార్డుల ప్రదానం చేస్తోంది. ఈసారి అవార్డుల ప్రదానోత్సవం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగింది.
*ఆధునిక థాయిలాండ్‌ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, ఆ దేశ మాజీ ప్రధాని ప్రేమ్‌ టిన్సులనోండా 98ఏళ్ల వయసులో ఆదివారం బ్యాంకాక్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.
*తెలంగాణలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో మరో 300 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2019-20 వైద్య విద్యాసంవత్సరం నుంచి నల్గొండ, సూర్యాపేటల్లో వైద్యకళాశాలలకు అనుమతులు లభించాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ వైద్య మండలి నుంచి సమాచారం అందింది.
*జాతీయ స్థాయిలోని ఉత్తమ వైద్యకళాశాలల జాబితాలో తెలంగాణకు చెందిన గాంధీ, ఉస్మానియాలకు స్థానం లభించింది.
*వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు తెరాస మంత్రులు, శాసనసభ్యులకు సవాలుగా మారాయి. గెలిచేందుకు పార్టీకి అవసరమైన మేరకు బలం ఉన్నా, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల పరిణామాలతో అధిష్ఠానం అప్రమత్తమయింది.
*లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కింలలో శాసనసభ ఎన్నికలు, ఉప ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తనను ప్రధాన మంత్రిగా నియమించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో మోదీ వెంకయ్యనాయుడు నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు.
*భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాల్లో మైత్రి చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదివారం ఫోన్‌ చేసి, అభినందనలు తెలిపారు.
*లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కింలలో శాసనసభ ఎన్నికలు, ఉప ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
*పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అధికారులు తదుపరి చేపట్టే శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ నెలాఖరుకల్లా ఎస్సైలు, జులై నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ చేపట్టాలని భావిస్తున్నారు. దాదాపు 1250 మంది ఎస్సైలు, 17 వేల మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. మూడు బ్యాచ్‌లుగా జరిగే ఈ శిక్షణ జూన్‌ నెలాఖరుకల్లా పూర్తికానుంది.
* రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి కాకుండా కొత్తగా 23 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. కొత్త జడ్పీలు ఆయా జిల్లా కేంద్రాల్లోనే కొలువుదీరనున్నాయి. వీటికోసం భవనాల అన్వేషణ కొనసాగుతోంది.
*ఏపీలో ఆదివారం జరిగిన గ్రూప్‌-1 పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్‌) ప్రశాంతంగా జరిగింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారిలో 73.76శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నల్లో దొర్లిన అనువాద దోషాలు అభ్యర్థులను తిప్పలుపెట్టాయి.
*ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్రంలో టీఆర్‌టీ కింద ఎంపికైన అందరికీ త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
*పోలీసులు అరెస్టు చేసిన సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర నేత ఆనంద్‌ అలియాస్‌ బొమ్మని నర్సింహను విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనపై ఏమైనా కేసులుంటే న్యాయస్థానంలో హాజరు పర్చాలని విజ్ఞప్తిచేశారు. ఈ నెల 24న బషీర్‌బాగ్‌లో ఆనంద్‌ను అరెస్టు చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దిల్లీలోని ఏపీ భవన్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలతో సమావేశం అనంతరం జగన్‌ నేరుగా ఏపీ భవన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు. బాణసంచా కాల్చారు.
*పంచాయతీల్లో రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ ప్రతిపాదనలు కొత్త ప్రభుత్వ మొదటి మంత్రివర్గ సమావేశ పరిశీలనకు వెళ్లనున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న బాధ్యతలు చేపట్టాక నిర్వహించే మొదటి మంత్రివర్గ సమావేశ అజెండా తయారీకి ఇప్పటికే కసరత్తు మొదలైంది.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జరిగే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో సభా వేదిక ఏర్పాటు పనుల్లో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది.
*భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాల్లో మైత్రి చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదివారం ఫోన్‌ చేసి, అభినందనలు తెలిపారు.
*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తనను ప్రధాన మంత్రిగా నియమించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో మోదీ వెంకయ్యనాయుడు నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు.
*విజయవాడ-మచిలీపట్నం వయా గుడివాడ రైల్వేలైను డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.పది వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సంబంధిత పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి.
*ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటనకు జూన్‌ 1న విశాఖపట్నం వస్తున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఉప రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటారు. సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో జరిగే కందుకూరి వీరేశలింగం వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొంటారు. జూన్‌ 2న ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలోని ఐఐపీఈ ప్రాంగణంలో జరిగే రెండు రోజుల కార్యశాలలో పాల్గొంటారు. 3వ తేదీ సాయంత్రం 4.30కు ప్రత్యేక విమానంలో ఉపరాష్ట్రపతి తిరుపతి బయలుదేరుతారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
*రాయలసీమ జిల్లాల్లో కరవు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
* వారానికొకటి వచ్చే వీక్ ఆఫ్ లో ఏం చేస్తుంటారు? చేసేదేముం టది.. వచ్చినంతలోనే ఆ రోజు గడుస్తది అంటరా! ఓకే..ఓకే.. రెం డ్రోజులిస్తే.. కొంచెంఎంజాయ్ చేయొచ్చం టారా! సరే..సరే.. మరి మూడ్రోజులు వీక్ ఆఫ్ అయితే.. ఏం చేస్తరు? ఎవడిస్తడని ఎదురు ప్రశ్నించకండే..! బ్రిటన్ లో ని ఓ కంపెనీ మూడ్రోజులు వీక్ఆఫ్ ఇచ్చి జాలీగా గడిపేయమంటోంది.వారానికి నాలుగురోజులే పని అంటూ కొత్త రూల్ తీసుకొచ్చిం ది. అంతేకాదండోయ్.. ఉద్యోగులందరికీ భారీగా జీతాలు కూడా పెంచింది. ఆ కంపెనీ ఏది..అన్ని లాభాలొస్తున్నయా దానికి అని అడుగుతరా? ప్లైమౌత్ లో ని పోర్ట్ కల్లిస్ లీగల్స్ అనే సంస్థ ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కంపెనీ అంత మంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా ఊరుకుం టారా.. ఉద్యోగులంతాఎగిరి గంతేశారు. మస్తు ఖుష్ అవుతున్నా రు. తమ బాస్ ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా ఎక్కువ అంకితభావంతో పనిచేస్తున్నారు.