NRI-NRT

ఆస్ట్రియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

NRI TRS Austria Celebrates Telangana Formation Day In Vienna - TNILIVE Austria Vienna -European News In Telugu

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆదివారం తెరాస ఆస్ట్రియా శాఖ అధ్యక్షులు మేడిపల్లి వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివేక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్త్రం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఎన్నారై తెరాస శాఖ ఆస్ట్రియా దేశంలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొల్లాడి లక్మారెడ్డి, రమేష్ గౌడ్, సంతోషు రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.