DailyDose

నేటి అసెంబ్లీలో తెదేపా వైకాపా మాటల యుద్ధం-TNI కధనాలు

TDP YSRCP Debates And Arguments In Andhra Assembly Today-TNILIVE Special

1. ప్యాకేజి వద్దు హోదా కావాలి – జగన్‌
ప్రత్యేక హోదా అంశంపై ఏపీ సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల .. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానం పంపుతున్నాం. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అప్పటి ప్రభుత్వం సరిదిద్దక పోగా .. ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది. అందుకే ఈరోజు మనమంతా పోరాటం చేయాల్సి వస్తోంది. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, 47శాతం అప్పులను వారసత్వంగా పొందాం. ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ అభివృద్ధి సూచికల్లో వెనుకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం.
2. ఏపీ అసెంబ్లీలో రుణమాఫీపై వాగ్యుద్ధం
రుణమాఫీ అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘2014 ఎన్నికలకు ముందు దేశంలో ఎక్కడా కూడా రుణమాఫీ అనే పదం లేదు. వ్యవసాయం మీద తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. రిజర్వ్‌ బ్యాక్‌ సహకరించకపోయినా..కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. ఒక్కో రైతుకు రూ.1.50లక్షల వరకు రుణమాఫీ చేశాం. పక్కనే ఉన్న తెలంగాణ మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రమైనా రూ.లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఈదేశంలో రుణమాఫీ చేయలేమని చెప్పి చాలా ప్రభుత్వాలు, పార్టీలు మాట్లాడాయి. కానీ, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసి చూపించారు’’ పేర్కొన్నారు.
3. లోక్‌సభ తదుపరి స్పీకర్‌గా ఓం బిర్లా!
పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
4. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లాబీల్లో మంగళవారం ఉదయం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీచేసిన నారా లోకేశ్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎదురుపడి కరచాలనం చేసుకున్నారు. తెదేపా ఎమ్మెల్సీ లోకేశ్‌ టీడీఎల్పీ కార్యాలయం వైపు వెళ్తుండగా .. ఎదురుపడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పల కరించారు. ఇరువురూ నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.
5. లోక్‌సభలో తెలంగాణ ఎంపిల ప్రమాణస్వీకారం
17వ లోక్ సభలో తెలంగాణ ఎంపిలు కొందరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. టిఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపిలు ప్రమాణస్వీకారం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ప్రమాణం చేయగా.. తరువాత జహీరాబాద్ ఎంపిగా బిజి పాటిల్, మెదక్ ఎంపిగా కొత్త ప్రభాకర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపి వెంకటేశ్‌ నేతకాని, కుమార్‌, అరవింద్‌ ధర్మపురి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, అసదుద్దీన్‌ ఓవైసీ, డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు వరుసగా ప్రమాణం చేశారు.వీరిలో వెంకటేశ్‌ నేతకాని, బండి సంజయ్‌ కుమార్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు, రేవంత్‌ రెడ్డి ఫోన్ లో చూసుకుంటూ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ఇంగ్లీష్‌ లో అరవింద్‌ ధర్మపురి, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రమాణం చేయగా, బిబి పాటిల్‌, అసదుద్దీన్‌ ఓవైసీ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.
6. ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాయి. చివరిరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో వాడీ వేడి చర్చ జరిగింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి సమావేశాలివి. ఐదు రోజులపాటు కొనసాగిన సమావేశాల్లో 19 గంటల 25 నిమిషాల పాటు శాసనసభ జరిగింది. తొలిరోజు సభ్యుల ప్రమాణస్వీకారాలు, రెండో రోజు స్పీకర్‌ ఎన్నిక చేపట్టారు. మూడో రోజు గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగు, ఐదో రోజు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ చేపట్టిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. దీంతో పాటు సీఎం జగన్‌.. ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
7. హోదా సాధించలేకపోయాం
ఆంధ్రప్రదేస్ కు ప్రత్యెక హోదాను తాము సాధించలేకపోయామని హోదా సాధన బాద్యత ప్రజలు వైకాపాకి ఇచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ప్రవేశ పెటిన ఏపీ ప్రత్యెక హోదా తీర్మానం పై చర్చల్లో భాగంగా మంగళవారం చంద్రబాబు మాట్లాడారు. గడిచిన ఐదేళ్ళ కాలంలో హోదా సాధనకు ప్రయత్నించామని కనీ మావల్ల కాలేదని పేర్కొన్నారు. తాము విఫలమైందని ప్రజలు వైకాపాకి 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను తమ ప్రభుత్వమే ఏపీలో విలీనం చేసిదని చంద్రబాబు తెలియజేశారు. ప్రత్యేక హోదా అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని, అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ.. ఏపీ శాసనసభ తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు.
9. రుణమాఫీ అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం -టీడీపీ అచ్చెన్నాయుడు
‘‘2014 ఎన్నికలకు ముందు దేశంలో ఎక్కడా కూడా రుణమాఫీ అనే పదం లేదు.వ్యవసాయం మీద తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాక్‌ సహకరించకపోయినా..కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. ఒక్కో రైతుకు రూ.1.50లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఈ దేశంలో రుణమాఫీ చేయలేమని చెప్పి చాలా ప్రభుత్వాలు, పార్టీలు మాట్లాడాయి. కానీ, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసి చూపించారు’’మంత్రి ఆదిమూలపు సురేష్‌ రుణమాఫీ విషయంలో విశ్వసనీయత కోల్పోవడం వల్లే తెదేపా ప్రతిపక్షంలో కూర్చుందని విమర్శించారు.