DailyDose

మరింత దిగజారిన దేశ వృద్ధిరేటు-వాణిజ్య-06/21

Indias GDP Gets Reduced Further Down-June 21 2019-Daily Business News

* ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలోని దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.6శాతమేనని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో వృద్ధిరేటు 6.8శాతమే ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది.
ఉత్పత్తి, వసాయరంగం గత ఏడాదిగా మాంద్యంలోకి దిగజారిన సూచనలే కనిపిస్తున్నాయి. ఇదే ఏజన్సీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో వృద్ధిరేటు 7 శాతం ఉండవచ్చునని అంచనావేసి ఆ తర్వాత దానిని సవరించింది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నదని కూడా ఆ ఏజన్సీ తెలియజేసింది. 25న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సందర్భంలో వృద్ధిరేటు అంచనాను ఫిచ్‌ తగ్గించడం విశేషం.. గత ఐదు సంవత్సరాలుగా ఆర్థిక వృద్ధి మాంద్యంలోనే ఉన్నది. 2018-19 సంవత్సరంలో కూడా వృద్ధిరేటు 6.8శాతంగానేఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు ఐదేళ్ల కాలంలో చూసినప్పుడు మరింత తగ్గి 5.8శాతంగానే ఫిచ్‌ అంచనా వేసింది. ఇదే త్రైమా సికంలో చైనా వృద్ధిరేటు 6.5శాతంగా నమోదైంది. అంటే భారతదేశ వృద్ధి చైనా కంటే వేగంగా లేదు. 2020-21లో వృద్థిరేటు 7.1శాతం ఉండవచ్చునని అంచనా వేసినప్పటికీ 2019-20లో మాత్రం 6.6 శాతం గానే ఉంటుందని ఫిచ్‌ తెలిపింది. ఇదే సమయంలో భారత రిజర్వు బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7శాతం ఉండవచ్చునని అంచనా..అయితే జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గిపోయింది. ఆర్థికవృద్ధిరేటు 2018 మొదటి త్రైమాసికంలో 8.1 శాతం ఉంటుందని అంచనావేసినప్పటికీ అది 5.8శాతానికి పడిపోయింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే ఇది అత్యంత తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తిరంగం, వ్యవసాయం మాంద్యంలో ఉండటంవల్లనే ఆర్థికవృద్ధి కూడా తక్కువ గా ఉంది. అలాగే ఎగుమతుల వృద్ధి కూడా తగ్గింది. ఆర్థికవృద్ధి బలహీనంగా ఉన్న నేపధ్యంలో రిజర్వుబ్యాంకు ఈ నెలలో జరిగిన సమావేశంలో ఈ ఏడాది 3వసారి కూడా వడ్డీరేటును 0.25శాతం తగ్గించింది. ఈ ఏడాది చివరినాటికి మరొ 25 బేసిక్‌పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనావేసింది. మౌలిక సదుపాయాలు, వినిమయం, వృద్ధిని అంచనావేసి బ్యాంకింగేతర ఆర్థికకంపెనీలు రుణపంపిణీని తగ్గించాయి.బ్యాంకులు రుణపంపిణీని పెంచడం ద్వారా కొంతవరకు ఈ లోటును సర్దుబాటు చేసాయి. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థికవృద్ధి ఈ ఏడాది 2.8శాతంగా ఉండవచ్చునని ఫిచ్‌ అంచనా వేసింది. 2018లో ఆర్థికవృద్ధి 3.2శాతంగా నమోదైంది.
*ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. శాంసంగ్‌, నోకియా, మోటోరోలా వంటి సంస్థలకు చైనా మొబైల్‌ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ ఏర్పడింది.
*ఆంధ్రా బ్యాంక్ మూలధన సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై ఈ నెల 27న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. ఎంత మొత్తం సమీకరించాలి? ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలను ఆ రోజే ఖరారు చేయనున్నారని తెలిసింది.
* రాంకీ ఎన్విరో ఇంజినీర్స్కు బోర్డు ఛైర్మన్గా బీఎస్ శాంతరాజు నియమితులయ్యారు. గుజరాత్ గ్యాస్ ఎండీగా, దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
*టాటా మోటార్స్ రుణ రేటింగ్ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) పనితీరుపై ఆందోళనలే ఇందుకు కారణంగా పేర్కొంది.
*విద్యుత్ వాహనాలను 5 శాతం శ్లాబులోకి తీసుకొచ్చే ప్రతిపాదనను నేడు జీఎస్టీ మండలి పరిశీలించనుంది. ప్రస్తుతం వీటికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. దీనిని 5 శాతానికి తగ్గించే అంశంపై ఈ రోజు జరిగే జీఎస్టీ మండలి 35వ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని ఓ అధికారి వెల్లడించారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి అంచనాలను డీబీఎస్ బ్యాంక్ కోత విధించింది. ముందు 7 శాతంగా అంచనా వేసిన డీబీఎస్.. తాజాగా దాన్ని 6.8 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది.
*మారుతీ సుజుకీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రూ.12,690 వరకు ప్రియమైంది. కొత్త భద్రతా, ఉద్గార నిబంధనలు అమలు చేయడం వల్ల ధర పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.
*వైఫై సేవలను అందించేందుకు అంగళ్లు, రెస్టారెంట్లు, ఇతర చిన్న వ్యాపారులకు అనుమతులు ఇచ్చే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.
*అమెరికా దృష్టికోణంలో హువావేను చూడొద్దని చైనా గురువారం భారత్ను అభ్యర్థించింది. అమెరికా ప్రభావానికి గురి కాకుండా భారత్ నిర్ణయం తీసుకోవాలని కోరింది.
*దక్షిణకొరియాకు చెందిన కార్లతయారీ సంస్థ కియా భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్న సెల్టోస్ ఎస్యూవీని తొలిసారి అధికారికంగా ప్రదర్శించింది.
*బలమైన అంతర్జాతీయ సంకేతాలు, దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్ను దాటింది. గురువారం ఒక్కరోజే రూ. 280 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ. 34,020 పలికింది.