DailyDose

జులై 1నుంచి కొత్త నిబంధనలు-వాణిజ్య-06/27

Daily Business News-New RBI Regulations From July 1st-June272019

* ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే పలు అంశాలు జులై 1 నుంచి మారనున్నాయి. బ్యాంకుల దగ్గర నుంచి కార్ల కంపెనీల వరకు పలు విషయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించేందుకు చార్జీలు వసూలు చేయవద్దని భారతీయ రిజర్వు బ్యాంక్ ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఎస్‌బీఐ తన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును రేపో రేటు తగ్గినప్పుడల్లా తగ్గిస్తుంది. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులో బేసిక్ అకౌంట్ కలిగిన వారు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేకుండానే ఇతర సేవలు పొందొచ్చు. నాలుగు సార్లు ఏటీఎం నుంచి ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచుల్లో ఎన్నిసార్లైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును ఫ్రీగా పొందొచ్చు. ఈ నిబంధన జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. వాహన కంపెనీలైన టాటా మోటార్స్ ఇప్పటికే కార్ల ధరలు పెంచేసింది. హోండా కార్స్ కూడా వచ్చే నెల నుంచి ధరలు పెంచబోతోంది. మహీంద్రా కంపెనీ కార్ల ధరలు కూడా జులై 1 నుంచి రూ.36,000 పెరగనున్నాయి.
* హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్స్‌‌ని ఉద్యోగాల్లోకి తీసుకోనుంది. నోయిడా క్యాంపస్ కోసం 3వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో 2,000 ఉద్యోగాలను తాజాగా ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. మరో 1,000 ఉద్యోగాల కోసం మ్యాథ్స్‌తో ఇంటర్ పాసైన విద్యార్థులను, ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి సంవత్సరం పాటు ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత కంపెనీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. అనుబంధ కంపెనీ హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాపింగ్ సర్వీసెస్ ద్వారా వీరికి శిక్షణ ఇప్పిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు.
*నోయిడా కార్యాలయం కోసం 3000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది.
*ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ధరలు తగ్గినందున, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల పునరుద్ధరణకు దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చని ఓ నివేదిక పేర్కొంది.
*వెల్స్పన్ గ్రూప్ సంస్థ తెలంగాణలో రూ.1150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న టైల్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీలో ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ ఫ్లోరింగ్ సీఈవో ముఖేశ్ సావ్లానీ బుధవారం ఇక్కడ చెప్పారు.
*రుణభారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న జీఎంఆర్ చత్తీస్గఢ్ ఎనర్జీ లిమిటెడ్ను అదానీ పవర్ సొంతం చేసుకోనుంది.
*విద్యుత్ వాహనాల (ఈవీ)కు మారడానికి మొత్తం వ్యవస్థ సంసిద్ధంగా ఉండేలా ప్రణాళిక అవసరమని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
*ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు స్థిరాస్తి విపణిలోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.28,000 కోట్లు) మేర వచ్చినట్లు ప్రోపర్టీ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది.
*చెల్లింపులకు సంబంధించిన మొత్తం సమాచారం (డేటా) భారత్లో మాత్రమే నిల్వ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది.
*రుణ ఎగవేతదార్లకు ఉచ్చు మరింత బిగిసేలా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అడిగితే ఎగవేతదార్ల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని అందజేయాలని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి ఆదేశాలిచ్చింది.
*కొరియా సంస్థ ఎల్జీ కొత్తగా డబ్ల్యు శ్రేణి స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిని రూ.8,000-15,000 శ్రేణిలో లభించే 5 రకాల ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నామని, ఆన్లైన్ పోర్టల్ అమెజాన్ డాట్ ఇన్లోనే విక్రయిస్తామని ప్రకటించింది.
*అమెరికాకు చెందిన స్మార్ట్హోమ్, బిల్డింగ్ ఆటోమేషన్ కంపెనీ హోగర్ కంట్రోల్స్ హైదరాబాద్లో తయారీ యూనిట్, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.