Movies

పాలకొల్లులో జనసేన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్

పాలకొల్లులో జనసేన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ - Janasena Film Institute To Be Opened In Palakollu By Pawan Kalyan

పవన్ చేతులు మీదుగా జనసేన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌……

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభంకానుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన తరఫున ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు.  ఈ మేరకు  ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పాలకొల్లులో తెలుగు పరిశ్రమ లెజెండ్‌ ఎస్వీ రంగారావు పేరుతో ఈ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. 

అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుందని ఆ ప్రకటనలో గుర్తు చేసింది. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే  ఈ ఇన్‌స్టిట్యూట్‌కి ఛైర్మన్‌గా హరిరామజోగయ్య వ్యవహరిస్తారు. నటన, దర్శకత్వ విభాగాల్లో ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. రాజా వన్నెంరెడ్డి దీనికి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. నటన, దర్శకత్వం, ఇతర విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ త్వరలో సిద్ధం కానుంది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం కానుంది.