DailyDose

అమర్‌నాథ్ యాత్రలో తెలుగు మహిళ మృతి-నేరవార్తలు–07/04

Women Dies In Amaranath Yatra-Daily Crime News-July42019

* హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బెంజ్‌కారు వచ్చిన యూఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్‌ అహ్మద్‌ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
*అమర్‌నాథ్ యాత్రలో తెలుగు మహిళ ఒకరు మరణించారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బాలాజీనగర్‌-1కు చెందిన పెండ్లిమరి భాగ్యమ్మ జూన్ 26న తన భర్త శంకరయ్యతో పాటు అమర్‌‌నాథ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు.కడప నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ ప్రెస్‌లో ఢిల్లీ చేరుకున్న వారు .. అక్కడి నుంచి జమ్మూకశ్మీర్‌లోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు వెళ్లారు. అనంతరం అమర్‌నాథ్‌కు వెళ్లాల్సి వుంది.. అయితే బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భాగ్యమ్మకు గుండెపోటు వచ్చింది.దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సహాయక బృందం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సోనామార్గ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం ప్రత్యేక ఎయిర్‌బస్ ద్వారా హైదరాబాద్‌ విమానాశ్రయానికి భాగ్యమ్మ భౌతికకాయం చేరుకోనుంది.
* ఐఎన్‌ఎక్స్‌ కేసులో అప్రూవర్‌గా ఇంద్రాణి
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అప్రూవర్‌గా మారడం కోసం ఇంద్రాణి ముఖర్జియా పెట్టుకున్న అభ్యర్థనను గురువారం దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా నిందితులుగా ఉన్నారు. ఐఎన్‌ఎక్స్‌ కేసులో అప్రూవర్‌గా మారడానికి ఇదే కేసులో నిందితురాలైన ఇంద్రాణి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్‌ అందుకు సమ్మతించారు. ఇప్పటికే కూతురు షీనా బోరా హత్య కేసులో ముంబయిలో జైలు జీవితం గడుపుతోన్న ఆమె మీద న్యాయస్థానం ప్రొడక్షన్ వారెంట్‌ను జారీ చేసింది.
* పిడుగురాళ్ళ శివారు ప్రాంతమైన బాబు జగజ్జివన్ రావు కాలనిలో బుధవారం అర్ధరాత్రి స్థానిక కాలనీ వాసుల పై కాలనీ నిర్వాహకులు కత్తులతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.
* కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం ఒకటి వెలుగు చూసింది.పోలీసుల దాడిలో తెలుగు యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని రేపింది. రాజమండ్రికి చెందిన ఆకాశ్ అనే యువకుడు కంచి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లాడు. కంచి ఆలయంలోని బంగారు బల్లిని ఫోటో తీసేందుకు ఆకాశ్ యత్నించడంతో ఆగ్రహించిన పోలీసులు లాఠీలతో చితకబాదారు. దీంతో దెబ్బలకు తాళలేక ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు
* హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బెంజ్‌కారు వచ్చిన యూఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్‌ అహ్మద్‌ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు రాయదుర్గంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
* అనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మనవరాలి వయసున్న చిన్నారిపై మద్యం మత్తులో ఉన్న ఓ కామాంధుడు విచక్షణ మరిచి కిరాతకానికి ఒడిగట్టిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి తనను తాను తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు.
* ఓ ట్రాక్టర్ కాలువలో చిక్కుకుపోయింది. కుండపోత వర్షంతో బరన్ ప్రాంతంలో జాతీయ రహదారి-27 కు సమీపంలో ఉన్న కాలువకు వరద నీరు పోటెత్తింది. ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో చిక్కుకుంది. ట్రాక్టర్‌ను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమందించారు. 7 గంటల తర్వాత ట్రాక్లర్‌తోపాటు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. * MMTS రైలు కింద జారిపడి ఓ యువతి మరణించిన తీరు అందరినీ కలచివేసింది. అనుకోకుండా మొబైల్ కిందపడటంతో..సెల్ ఫోన్ అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా కాలుజారి ఆమె కూడా ట్రైన్ కిందపడిపోయింది. దీంతో ఆమెపై నుంచి రైలు కదలడంతో ఆమె బాడీ రెండు ముక్కైలై అక్కడికక్కడే మరణించింది. కళ్లముందే క్షణాల్లో ఈ సంఘటన జరగడంతో ట్రైన్ లో ప్రయాణికులు అంతా కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని సీతాఫల్ మండిలో బుధవారం ఉదయం జరిగింది.
* మహారాష్ట్రలోని తివారే డ్యామ్ కూలి 23 మంది చనిపోయారు. కొంకణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో …డ్యామ్ దిగువున ఉన్న గ్రామాలకు వరదలు వచ్చాయి. భారీవర్షాలకు పైనుంచి ఉధృతంగా వరదనీరు చేరడంతో మంగళవారం రాత్రి డ్యాం కొట్టుకుపోయిందని అధికారులు చెప్పారు. ఇంతవరకు11 మృతదేహాలను బయటకు తీసినట్టు రత్నగిరి అడిషనల్‌‌‌‌ ఎస్పీ విశాల్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌ చెప్పారు.
* హైదరాబాద్ నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఐడీఏ నుంచి బొల్లారంకు కూలీలతో వస్తున్న వాహానం వెనుక టైరు ఒక్కసారిగా పగలడంతో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మరణించారు. మరణించిన వారు భార్యాభర్తలుగా తెలిసింది. స్థానికుల సమాచారంలో పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
* రామడుగు మండలం గుండిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇటుక బట్టీ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని రెండేళ్ల బాలిక హన్సిక మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
* హైదరాబాద్శివార్లలోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ జిల్లాకొడంగల్ ప్రాంతానికి చెందిన సుబ్బయ్యచంద్రకళ దంపతులు.. మూడేళ్లుగా రాజేంద్రనగర్హైదర్‌గూడలో నివాసం ఉంటున్నారు. అదే కాలనీలో నివాసం ఉండే రాములువిజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. శ్రావన్ (18), సందీప్ (16).. ఈ ఇద్దరూ ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పిభవనం పైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
*వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం దగ్గర గల జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
*ఎస్కార్ట్ పోలీసుల కన్నుగప్పి ఖైదీ పరారైన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా పొందూరుకు చెందిన కె.లక్ష్మీనారాయణ నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు.
*ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోని కాంచీపురంలో ఆలయాల సందర్శనకు వచ్చిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమహేంద్రవరం పరిధి తుళ్లూరుకు చెందిన నారాయణరెడ్డి తన భార్య నాగేశ్వరి, కుమారులు ఆకాష్, మౌళీ నారాయణతో కలిసి కాంచీపురం ఆలయాల సందర్శనకు వచ్చారు.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛేదనలో ప్రత్యేక బృందం మరో అడుగు ముందుకేసింది. మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంటి వద్ద విధుల్లో ఉన్న వాచ్మ్యాన్ రంగన్నకు నార్కోఅనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ బుధవారం పిటిషన్ వేశారు.
*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బుధవారం శవయాత్రగా వెళ్లిన వారిపై తేనేటీగలు దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
*విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును మావోయిస్టుల దాడికి సంబంధించిన కేసు విచారణ నిమిత్తం కర్ణాటక పోలీసులు బుధవారం తమ కస్టడీకి తీసుకున్నారు. 2005 తుమకూరు నక్సల్ దాడి, ఎల్గార్ పరిషద్ కేసుల్లో వరవరరావు నిందితుడు. ప్రస్తుతం ఆయన పుణెలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఎల్గార్ పరిషద్ కేసుకు సంబంధించి గతేడాది ఆగస్టు 28న వరవరరావు, మరో నలుగురు పౌరహక్కుల నేతలను పుణె పోలీసులు అరెస్టుచేసిన సంగతి తెలిసిందే.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడులో అటవీ అధికారులపై దాడికి సంబంధించి 12 మంది నిందితులను రిమాండుకు పంపారు. ములకలపల్లి మండలం తిమ్మంపేట బీట్లోని సెక్షన్ అధికారి నీలమయ్య సహా ఐదుగురు సోమవారం రాత్రి దాడిలో గాయపడటం విదితమే.
*తిరుమలలో బుధవారం వేకువజామున చోరీ జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి బంధువు హైదరాబాద్కు చెందిన విజయ్సేన్రెడ్డి 12 మంది కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు.
*తన బిడ్డను అపహరించిందంటూ రెండో భర్త ఫిర్యాదు చేయడంతో నటి వనితా విజయకుమార్ను తెలంగాణ పోలీసులు బుధవారం విచారించారు. ఆమె ‘బిగ్బాస్’ కార్యక్రమంలో ఉండటంతో ఆ హౌస్కు చేరుకుని విచారణ చేపట్టారు. ‘బిగ్బాస్’ సీజన్-3 పోటీదారుల్లో ఒకరైన వనితా విజయకుమార్ తన రెండో భర్త ఆనందరాజ్ నుంచి 2012లో విడాకులు తీసుకున్నారు
*ఏటీఎం నుంచి దొంగతనానికి ప్రయత్నించిన ఓ యువకుడు అనూహ్య రీతిలో ప్రాణం కోల్పోయాడు. యాదాద్రి జిల్లా నారాయణపురం ప్రాంతం గట్టుప్పల గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న సంఘటన ఇది.
*హజ్ యాత్రికుల ద్వారా అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న వైనం బట్టబయలైంది. హైదరాబాద్ దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ ముఠా వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.