DailyDose

భార్య చేతిలో భర్త హత్య-నేరవార్తలు–07/09

Wife Kills Husband - Daily Crime News - July 9 2019

* దుబాయ్‌‌ నుంచి వచ్చిన ప్రతిసారి గొడవ పడుతున్నాడని భర్తను రోకలి బండతో తలపై కొట్టి హత్యచేసిందో భార్య. నిజామాబాద్‌‌ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నాయిడి గంగారాం(50), నాయిడి సాయవ్వ దంపతులకు ముగ్గురు పిల్లల్లు, వారందరికి పెళ్లీలు అయ్యాయి. గంగారాం దుబాయి వెళ్లి కొద్ది రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఆదివారం మద్యంతాగి ఇంటికి వచ్చాడు ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూడగా గంగారాం మృతదేహం రక్తపుమడుగులో పడి ఉంది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి విచారించగా భర్తను తనే చంపినట్లుగా భార్య సాయవ్వ ఒప్పుకుంది.
* అత్తింటి వేధింపులు తట్టుకోలేక రెండేళ్ల కొడుకుతో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎల్ బీనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం..నాగోల్ బండ్లగూడకి చెందిన తూర్పాటి రాజశేఖర్ నల్లకుంటకి చెందిన సుజాత(27)ని ఐదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు నితీశ్ ఉన్నాడు.
* గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దోడ్లేరు గ్రామంలో అదే గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన 30 బస్తాలు రేషన్ బియ్యాన్ని మిని లారిలో తరలిస్తుండగా పట్టుకుని కేసునమోదు చెసిన క్రోసూరు యస్సై పి.జనార్దన్.
* నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేసి పలువురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
* విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఘాట్ రోడ్డు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది . ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 37 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సాలో మొక్కును తీర్చుకునేందుకు మజ్జి గైరమ్మ దేవతను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. వీరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్ద కారును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని కొత్తగూడెం ఏరియా హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు.
* జల్సాలకు అలవాటు పడి తేలికగా డబ్బు సంపాదించవచ్చన్న లక్ష్యంతో సెల్ ఫోన్ చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక సెల్ ఫోన్, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంసిలాల్ పేట్ కు చెందిన పాత నేరస్తుడు మహేష్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు యువకులతో కలసి మొబైల్ ఫోన్లు స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగా రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలో తన ఇంటి ముందు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్న యువకుని చేతిలో నుండి సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా బైక్ ను గుర్తించి నిందితులను అరెస్ట్ చేశామని ఇన్స్ పెక్టర్ చోట సి హెచ్ బాబు తెలిపాడు. వారిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.
* తన భార్యకు చెందిన భూమి పట్టాపుస్తకాలు ఇవ్వకుండా… తనకు రైతు బంధు సహాయం అందివ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో అర్ధనగ్నంగా నిరసనకు దిగాడో వ్యక్తి.ఖానాపూర్ మండలం దిలావర్ పూర్ లో తన భార్య పుట్టింటి వాళ్లు కట్నంగా 6 ఎకరాల భూమిని ఇచ్చారని వివరించాడు. ఐతే…. ఆమె పేరుతో ఉన్న భూమిని …ఆమె సోదరుడు, తన బావమరిది లాక్కున్నాడని … అధికారులతో కుమ్మక్కై పేరు మార్చుకున్నాడని ఆరోపించాడు. అధికారులు చెప్పినా పట్టించుకోలేదని ఇలా… కలెక్టరేట్ ముందు అర్ధనగ్నంగా… నోటికి నల్లబ్యాడ్జీ, మెడకు ప్లకార్డు వేసుకుని నిరసన తెలిపానని చెప్పాడు.
* దుబాయ్‌‌ నుంచి వచ్చిన ప్రతిసారి గొడవ పడుతున్నాడని భర్తను రోకలి బండతో తలపై కొట్టి హత్యచేసిందో భార్య. నిజామాబాద్‌‌ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది.
* వరకట్న వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది. వేధింపులు తాళలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి మణిమొళి అనే మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ధర్మపురి జిల్లా కదిర్‌ నాయకన్‌హల్లికి చెందిన మణిమొళికి సెంగాని అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండో రోజు నుంచే ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో అదనంగా నాలుగు లక్షల నగదు, బంగారు నగలు తెచ్చింది.
* యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి మోసం చేసిన కేసులో నిందితుడు షేక్‌మహమ్మద్ జహంగీర్ పాషాకు 10సంవత్సరాల జైలుశిక్ష, రూ.60,000 ల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లాకోర్టు 1వ ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దబ్బాకొంట ఏరియాలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌లు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలి నుంచి ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.
* బోరబండలో విషాదం నెలకొంది. ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఓ ఆర్మీ జవాను మృతి చెందాడు. ప్రకాశం జిల్లా పాపినేనిపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని అశోక్‌ కుమార్‌.. జమ్మూకశ్మీర్‌లో జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అశోక్‌ వద్ద ఉన్న తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో నిన్న మృతి చెందినట్లు ఆర్మీ సిబ్బంది.. మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. మూడురోజుల్లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తామని ఆర్మీ అధికారులు చెప్పినట్లు అశోక్‌ తల్లిదండ్రులు వెల్లడించారు. అశోక్‌ సోదరుడు సురేశ్‌ బాబు కూడా ఇండియన్‌ ఆర్మీలోనే పని చేస్తున్నాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*గుంటూరు జిల్లా దాచేపల్లి మండలలో అక్రమమంగా రవాణా చేస్తున్న 260 టిక్కీల రేషన్ బియ్యాన్ని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేసి పలువురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నగర ఇన్‌చార్జి డీఎస్పీ మరియదాసు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
*రోడ్డుపై నడిచివెళుతున్న 1,800 మందికిపైగా మహిళల్ని మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసిన కారు డ్రైవర్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్‌ జిల్లా మేగనూరుకు చెందిన శక్తివేలు (27) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భార్యతో మోగనూరు బస్టాండ్‌లోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌ సేవించి బయటికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి శక్తివేలు భార్యను మొబైల్‌ ఫోన్‌లో ఫొటో తీశాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన శక్తివేలు అతన్ని నిలదీశాడు. ఆగ్రహించిన అతను శక్తివేలుపై దాడి చేయడమే కాకుండా హత్యా బెదిరింపులు చేశాడు.
*దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభం కాగా, నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 84 పాయింట్లు లాభపడి 38,804 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 11,545 వద్ద కొనసాగుతోంది.
*అదుపు తప్పి ఓప్రైవేట్‌ టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం ఒంటిమామిడి ఘాట్‌రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 37 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడడంతో సహాయక చర్యలు అందక బాధితులు రెండున్నర గంటలపాటు అవస్థలు పడ్డారు. కాకినాడకు చెందిన వీరు ఒడిశా రాయ్‌గఢ్‌లోని మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే… మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ కేసులో మహిళతోపాటు ఆమెను పెండ్లి చేసుకున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
*విశాఖ పట్నం జిల్లాలోని పాడేరు మండలం వంటలమామిడి ఘట్రోడ్డులో మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో 37 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.
*ఎలాంటి ఆధారాలు లభించక ఓ హత్య కేసు సంక్లిష్టంగా మారిన క్రమంలో సీసీ టీవీ దృశ్యాల్లో కనిపించిన మేక నిందితులను పట్టించింది. కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన మేకల కాపరి రాము నాయక్ హత్య కేసులో మిస్టరీ వీడింది.
*విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ప్రకాశం జిల్లా అర్థవీడు మండలానికి చెందిన సైనికుడు మృతి చెందారు. మండలంలోని పాపినేనిపల్లికి చెందిన తమ్మినేని అశోక్కుమార్(21) జమ్ములోని ఉరి సెక్టార్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దగ్గరున్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలటంతో అశోక్కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సోమవారం ఆర్మీ అధికారులు బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చారు.
*కర్ణాటకను కుదిపేసిన ఐఎంఏ నగల సంస్థల ఆర్థిక నేరాల కేసులో బెంగళూరు జిల్లాధికారి విజయ్ శంకర్ను సిట్ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
*స్థలం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ సామాజిక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడిలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
*వ్యవసాయ బోరుకు కరెంట్ కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం పైకెక్కిన ఓ రైతు విద్యుదాఘాతంతో విగతజీవిగా మారాడు. ఈ సంఘటన సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో చోటుచేసుకుంది.
*గృహోపకరణాల మాటున విదేశాల నుంచి బంగారం తరలిస్తుండగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడు అబుదాబి నుంచి హైదరాబాద్కు వస్తూ రూ. 19.63 లక్షల విలువ చేసే 574 గ్రాముల బంగారానికి వెండి పూత పూసి జ్యూస్ యంత్రం, బ్లూటూత్ స్పీకర్లు, గడియారంలోనూ రహస్యంగా దాచిపెట్టుకుని వచ్చాడు. ఇక్కడి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
*ఒడిశా నుంచి వచ్చిన కూలీల కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన నిందితునికి జీవిత ఖైదు, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డా.ఎస్.శ్రీనివాస్రెడ్డి సోమవారం సంచలన తీర్పునిచ్చారు.
*మతి స్థిమితం కోల్పోయిన కుమార్తె తనకు భారంగా మారిందని భావించిన తండ్రి.. ఆమెను రోకలి బండతో కొట్టి చంపాడు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఘటన జరిగింది.
*పెళ్లి సమయంలో లేనిపోని మెలికలు పెట్టి ఉడాయించాడో ప్రబుద్ధుడు! అతగాడి కోసం బాలాపూర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
*ప్రమాదవశాత్తు తుపాకీ పేలి విధుల్లో ఉన్న ఆర్మీ జవాన్ మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని అశోక్కుమార్(21) జమ్మూ కశ్మీర్లోని ఉరి సెక్టార్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
*వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్ హత్య కేసు అనూహ్య మలుపు తీసుకుంది. రాంప్రసాద్ను తామే హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు మీడియా ముందుకు వచ్చారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయారు.
* ఎన్ని చట్టాలు చేసిన మూకదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న నెపంతో 24 మందిపై మూక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
*ఓ ప్రైవేట్ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్రోడ్డులో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
*హైదరాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ విమానాశ్రయంలోని 150 కిలోలకు పైగా పసిడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీక్షేత్రంలో సోమవారం ఉదయం మూడు పులుల మృతిచెందాయి.
*శ్రీవారి సేవకై తెలంగాణ నుంచి వచ్చి, తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి,తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమన్ ఈ రోజు తెల్లవారుజామున 3గంటలకు మృతి చెందారు.