WorldWonders

భారతదేశంలో ఖరీదైన ప్రాంతం కన్నాట్ ప్లేస్

Connaught Place Ranked Costly Area In India

దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయ ప్రాంతాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అక్కడ కేవలం ఒక చదరపు అడుగుకు 144 అమెరికన్‌ డాలర్ల వార్షిక అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది. దిల్లీ నడిమధ్యలో ఉన్న కన్నాట్ ప్లేస్‌ గత ఏడాది కూడా తొమ్మిదో స్థానాన్నే దక్కించుకుంది. ఈ జాబితాలో హాంకాంగ్‌లోని సెంట్రల్‌ డిస్ట్రిక్‌ వరసగా రెండో ఏడాది మొదటి స్థానాన్నే ఆక్రమించింది. అక్కడ ఒక చదరపు అడుగుకు వార్షిక అద్దె 322 అమెరికన్‌ డాలర్లని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో లండన్ రెండో స్థానంలో నిలవగా, బీజింగ్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్నీ తమ ఫ్రంట్ ఆఫీసును ఈ నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి’ అని సీబీఆర్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. దిల్లీ ప్రధాన మార్కెట్ కావడంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొదటి పది స్థానాల్లో నిలుస్తూనే ఉందని ఆయన తెలిపారు. అలాగే ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ జాబితాలో 27, 40వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో ఇవి వరసగా 26, 37వ స్థానాల్లో నిలిచాయి.