DailyDose

భారీగా పతనమైన మార్కెట్లు-వాణిజ్య-07/25

Telugu Business News Today - July 25 2019 - భారీగా పతనమైన మార్కెట్లు-వాణిజ్య-07/25

* దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయి 37,830 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 11,252 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. మే13వ తేదీ తర్వాత ఇంత సుదీర్ఘంగా మార్కెట్లు నష్టపోవడం ఇదే తొలిసారి. కార్పొరేట్‌ ఆదాయాలపై, హెచ్‌ఎన్‌ఏలపై పన్నులు విధించడం మార్కెట్లు కొంత ఇబ్బందికి గురిచేసింది. దీనికి తోడు ఐఎంఎఫ్‌ వృద్ధిరేటును తగ్గించడం కూడా మదుపరుల భయానికి కారణమైంది. నేడు ఉదయం ట్రేడింగ్‌ లాభాల్లో కొనసాగినా.. చివరి 30 నిమిషాల్లో నష్టాల బాట పట్టింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేయగా, 6.8 శాతానికే పరిమితం అవుతుందని సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సంస్థ డీబీఎస్ పేరొంది.
*ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.980.46 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
*ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.329.01 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏషియన్ పెయింట్స్ రూ.672.09 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారులను కలిగిన ఫేస్బుక్పై అత్యంత భారీమొత్తం జరిమానాల రూపంలో పిడుగు పడింది.
*ఐటీ సేవల సంస్థ విప్రో హైదరాబాద్లో డిజిటల్ ఉత్పత్తుల ప్రమాణాల తనిఖీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించింది.
* దక్షిణ భారతదేశ వెడ్డింగ్ ప్లానర్స్ను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఆగస్టు 6వ తేదీన రామోజీ ఫిల్మ్సిటీలో ‘సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్’ పేరిట భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ తెలిపారు.
*పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించే వారితో పాటు వ్యవస్థలను పట్టించుకోని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
*ఆగస్టు నుంచి ఎంపిక చేసిన కార్లపై 3 శాతం ధరలు పెంచనున్నట్లు విలాస కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది.
*అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సునేరాటెక్ హైదరాబాద్లో తన మూడో కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడి నుంచి క్లౌడ్, బ్లాక్చైన్, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ తదితర అంశాలపై అంతర్జాతీయంగా ఉన్న కేంద్రాలకు సహకారాన్ని అందించనుంది.
* పాత కార్ల క్రయవిక్రయాలకు వీలుకల్పించే ఆన్లైన్ సేవల సంస్థ అయిన కార్దేఖో ఒక పక్క దేశీయంగా విస్తరిస్తూనే మరోపక్క విదేశీ మార్కెట్లపై దృష్టి సారించింది.