Videos

అన్నూభాయి…పేపర్‌ఛాయి…తాగేసేయి

Annubhai Filters Tea Using Paper

పేపర్‌లో చాయ్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ ఎక్కడ? ఎలా? అనే ప్రశ్నలు మొదలయ్యాయా? అయితే పదండి.. తలనొప్పి వచ్చినా.. చలి చంపేసినా.. వాన ముంచెత్తినా ఠక్కున గుర్తొచ్చేది టీ. వేడి వేడి టీతో గొంతు తడిపితే ఆ హాయే వేరు. అందులోనూ ప్రత్యేకంగా టీ దొరుకుతుందంటే.. ఇంట్లో టీని వదిలి దుకాణాల బాట పడతారు తేనీటి ప్రేమికులు. ఇప్పటికే ఎన్నోరకాల చాయ్‌లు ఇలానే అందుబాటులోకి వచ్చాయి. వాటిన్నింటికీ భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నాడు ఆదిలాబాద్‌ జిల్లాకు చాందా.టి గ్రామానికి చెందిన అన్నూభాయ్‌. అప్పట్లో గిరిజన గ్రామాల్లో మోదుగ ఆకులను డొల్లలుగా మలిచి అందులో చాయ్‌ చేసేవాళ్లు. అదే స్ఫూర్తితో కాగితంతో చేయడం ప్రారంభించాడు అన్నూభాయ్‌. కాగితాన్ని డొల్లగా చేస్తూ అందులో టీ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అంతేకాదు కాగితంతో చాయ్‌ చేయడం బ్రహ్మ విద్యేం కాదంటున్నాడు. నిప్పుల మీద నడిచే సూత్రమే ఇక్కడా పనిచేస్తుందని చెబుతున్నాడు. మంట పెట్టకుండా నిప్పులపై కాగితం కాలకుండా జాగ్రత్త తీసుకుంటే ఎవరైనా పేపర్‌ చాయ్‌ చేయొచ్చంటున్నాడు ఈ చిరువ్యాపారి. ఒక్కసారి ఇక్కడ టీ రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ కావాలంటారని చెబుతున్నారు స్థానికులు. రోజుకు ఒక్కసారైనా ఇక్కడ తేనీరు సేవిస్తామని అంటున్నారు. రెండు దశాబ్దాలుగా టీకొట్టు నడుపుతున్న అన్నూభాయ్‌.. ప్రత్యేకంగా ఎవరైనా కోరితే పేపర్‌ చాయ్‌ తయారుచేసి ఇస్తున్నాడు.