DailyDose

అమెరికాలో మరో పూజారిపై దాడి-నేరవార్తలు–07/29

Another Hindu Priest Attacked In The US-Telugu Crime News Today-July 29 2019 - అమెరికాలో మరో పూజారిపై దాడి-నేరవార్తలు–07/29

*అమెరికాలో మరో జాతి విద్వేష దాడి జరిగింది. ఇటీవలే హిందూ పూజారిపై జరిగిన అటాక్మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఓ గురుద్వారా పూజారి అమర్జిత్ సింగ్పై గురువారం రాత్రి ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. గురుద్వారా ఆవరణలోని తన ఇంట్లోకి మాస్క్ధరించిన ఓ దుండగుడు కిటికీని పగులగొట్టుకుని లోపలికి వచ్చాడని, తన మెడపై పిడిగుద్దులు కురిపించాడని ఆయన వెల్లడించారు. నీ దేశానికి నీవు వెళ్లిపో అని అరుస్తూ బూతులు తిడుతూ.. దాడి చేశాడని చెప్పారు. శాన్ఫ్రాన్సిస్కోకు వంద మైళ్ల దూరంలో ఉన్న మోడెస్టో సెరెస్సిఖ్టెంపుల్ వద్ద ఈ సంఘటన జరిగింది. ‘‘కంట్రీ, కంట్రీ, కంట్రీ, గో బ్యాక్, గో బ్యాక్, కంట్రీ” అని అతడు అరిచాడని ఫ్రెస్నో బీ అనే లోకల్న్యూస్పేపర్కు సింగ్ తెలిపారు. జాతి విద్వేషంతోనే ఈ దాడి జరిగిందని గురుద్వారా సభ్యుడు, మోడెస్టో సిటీ కౌన్సిల్మాన్ మణి గ్రివాల్చెప్పారు. అయితే, అప్పుడే ఈ విషయాన్ని నిర్ధారించలేమని, దీనిపై విచారణ ప్రారంభించిన లోకల్పోలీసులు చెప్పారు. లోకల్సెనెటర్జోష్హర్డర్ఈ దాడిని ఖండించారు. సిక్కు మిత్రులకు తాను అండగా ఉంటానన్నారు. ఒక మైనారిటీ వర్గంపై దాడి జరిగితే అన్ని మైనారిటీ వర్గాలపై జరిగిన దాడిగానే చూడాలన్నారు. కాగా, న్యూయార్క్సమీపంలోని గ్లెన్ఓక్స్లో గల శివ శక్తి పీఠం వద్ద స్వామి హరీశ్చందర్పూరి అనే పూజారి జూలై 18న నడుచుకుంటూ వెళుతుండగా, ఓ వ్యక్తి దాడి చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి సెర్గియో గౌవియా అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
* హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసకుంది. ఫిలింనగర్‌లో సోమవారం ప్రేమ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
*కాలిఫోర్నియా- ఫుడ్‌ ఫెస్టివల్‌పై కాల్పులు.. ముగ్గురి మృతి……….
అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. కాలిఫోర్నియాలోని గిల్‌రాయ్‌లో ఫుడ్‌ఫెస్టివల్‌‌కు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. 12 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
* గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దుండగులు డెయిరీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి రెండో అంతస్తులో ఉన్న లాకర్‌ను పగలగొట్టి సుమారు రూ.44లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులో జమ చేయాల్సిన నగదంతా కార్యాలయంలోనే ఉంచాల్సి వచ్చింది.
*హైదరాబాద్ నగరంలోని చిక్కడిపల్లిలో వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. అర్థరాత్రి వ్యాపారవేత్త గజేంద్రప్రసాద్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. గజేందర్ హైదరాబాద్‌లో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్నాడు. కిడ్నాప్ అనంతరం దుండగులు రూ. 3కోట్లు డిమాండ్ చేశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్తలతో గొడవలున్నట్లు పోలీసులు గుర్తించారు. కోటి రూపాయలు తీసుకుని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కొంట అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
*చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చిరుత హల్చల్‌ చేసింది. సోమవారం చిరుత దాడిలో సుమారు 10 గొర్రెలు చనిపోగా, మరో 10 గొర్రెలకు గాయాలయ్యాయి. స్థానిక వివరాల ప్రకారం.. కుప్పం మండలం చిన్న గోపనపల్లి, గరిగచినపల్లి, అగ్రహారం, బైరప్పని గుట్ట గ్రామాల్లో గత రెండు రోజుల నుండి చిరుత సంచరిస్తూ.. గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
*ఒకటి కాదు.. రెండు కాదు, 100 కార్ల చోరీ: ఎట్టకేలకు చిక్కిన కార్లదొంగ…….
ఢిల్లీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కార్ల దొంగ జాహిద్ అలియాస్ అన్నా ఎట్టకేలకు చిక్కాడు. హాపూర్ గ్రామానికి జాహిద్ మీరట్‌లో నివసిస్తూ.. తన ముఠా సభ్యులతో కలిసి దాదాపు 100 కార్లను చోరీ చేశాడు.ఇతనిపై ఢిల్లీ, మీరట్, అలీఘడ్ ప్రాంతాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి. దీనికి తోడు వాహనదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
*ఉన్నావ్ రేప్ బాధితురాలు ఘోర రోడ్డు ప్రమాదంలో చావుబతుకులతో పోరాడుతోంది. ఆదివారం ఆమె వెళుతున్న కారును ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలికి 15 కిలోమీటర్ల దూరంలో ట్రక్కు ఢీకొట్టింది. రాయ్బరేలి జైలులో ఉన్న బాధితురాలి బాబాయి మహేశ్ సింగ్ను చూసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. చనిపోయిన వారిని ఆమె పిన్ని పుష్ప, మరో బంధువు షీలాగా గుర్తించారు. షీలా ఘటనా స్థలంలోనే చనిపోగా, పుష్ప ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
*తన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన ఓ మాజీ ఆర్మీ అధికారి… ఈ ప్రయంత్నంలో తన ప్రాణాలు కోల్పోయారు. తన ఇంటి పక్కన ఓ దుకాణంలో చోరీ జరుగుతుండగా చూసిన ఆయన దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాగా… దుండగులు ఆయనను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథిలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… శనివారం రాత్రి మాజీ ఆర్మీ అధికారి అమానుల్లా, అతని భార్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా… ఆ సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న దుకాణంలో దొంగలు పడ్డారు. గమనించిన అమానుల్లా దొంగల ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను పిలుస్తానంటూ దొంగలను హెచ్చరించారు.
* అట్టపెట్టెలో ఉన్న మగ పసికందు మృతదేహాన్ని విజయనగరంలోని ట్యాంక్బండ్ రోడ్డు సమీపంలో ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం గుర్తించారు.
*అప్పుల బెంగతో రైతు తనువు చాలించారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం కొర్ని గ్రామానికి చెందిన రైతు గోవిందరాజులు (43) మూడెకరాల్లో వరిసాగు చేస్తున్నారు.
*చదువుకో నాయనా అని కుమారుడికి చెప్పడమే ఆ తల్లి కడుపుకోతకు కారణమైంది. పుస్తకాలు పట్టమని కాస్త గట్టిగా అన్న తల్లి మాటలు ఆ పసివాడికి చీవాట్లుగా అనిపించాయి. క్షణికావేశంతో తను ఆటలాడుకునే తాడునే ఉరితాడుగా మార్చుకుని తనువు చాలించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం కొట్టకాడులో జరిగింది.
*అనుమానంతో భర్త చేసిన ఘాతుకం గర్భిణి అయిన భార్యను బలితీసుకుంది. కర్నూలు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
*ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వంతెనపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.
*రాజస్థాన్లో అత్యాచార బాధితురాలు పోలీసుస్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేశారు. తన భర్తకు వరుసకు సోదరుడయ్యే రవీంద్రసింగ్ తనపై 2015లో అత్యాచారం చేశాడని, అతడిని అరెస్టుచేయాలని ఆమె డిమాండ్ చేశారు.
*పదవీ విరమణ చేసిన ఆర్మీ కెప్టెన్ అమానుల్లా(64)ను ఆగంతుకులు కర్రలతో కొట్టి చంపేసిన ఘాతుకమిది. ఉత్తర్ప్రదేశ్లోని కమ్రౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని పుర్వా గ్రామంలో శనివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు ఆదివారం చెప్పారు.
*ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు సహా అమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో వాహనంలో ప్రయాణిస్తున్న బాధితురాలి పిన్ని, మేనత్త చనిపోయారు.
*హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో ఓ వాహనం బీభత్సం సృష్టించింది. డ్రైవర్కు మూర్చ రావడంతో వాహనం అదుపుతప్పి ముందున్న పది వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ అనే ట్రాఫిక్ హోంగార్డు గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందారు.
*హైదరాబాద్లోని హయత్నగర్లో యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. కారులో అపహరించుకుని వెళ్లిన ఘటనలో నిందితుడిగా ఉన్న రవిశేఖర్ కేసులో మరో మోసం బయటపడింది.
*దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటనలో అత్యాచార బాధితురాలు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది.