Agriculture

ధవళేశ్వరం వరద నీరు సముద్రం పాలు

Dhawalesvaram Flood Water Released Into Ocean - ధవళేశ్వరం వరద నీరు సముద్రం పాలు

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రమాదకరంగా మారుతోంది. గంట గంటకూ వరద పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తి వేసి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీలోకి 8.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే మోతాదులో 8.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఔట్‌ఫ్లో గా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటి మట్టం 10.7 అడుగులకు చేరింది. సాయంత్రంలోగా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.