WorldWonders

గ్రీన్‌ల్యాండ్ మంచు బిలియన్ టన్నుల కొద్దీ కరిగిపోతోంది

Greenland Ice Melting At The Rate Of 100Billion Tons Per Month-గ్రీన్‌ల్యాండ్ మంచు బిలియన్ టన్నుల కొద్దీ కరిగిపోతోంది

ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏదంటే గ్రీన్‌లాండ్ అని టక్కున చెప్పేస్తారు.

90 శాతానికి పైగా భూభాగం మంచుతో కప్పబడిపోయిన ఈ ఐస్‌లాండ్.. తన ప్రాకృతిక అందాన్ని కోల్పోతుంది.

ఇందులో ఉన్న మంచు అతి వేగంగా కరుగుతోంది. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తోంది.

సుమారు 12 బిలియన్ టన్నుల మంచు కేవలం 24 గంటల్లో కరిగిపోయిందట.

భూమిపై పెరిగిపోతున్న వేడిమికి అంటార్కిటికా ఖండంలోని మంచు గడ్డలు క్రమంగా కరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ముప్పు గ్రీన్‌లాండ్‌ను కూడా తాకింది.

గతవారం రోజులుగా మంచు కరగడం ఎక్కువైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జూలై 31న అతి ఎక్కువ మంచు కరిగిందని, 2012 నాటి నుంచి ఇదే ఎక్కువని తెలిపారు.

ఒక్క జూలైలోనే 197 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయి అట్లాంటిక్ సముద్రంలో కలిసిందని వాతావరణ పరిశోధకులు రుత్ మొట్రామ్ తెలిపారు.

దీంతో సముద్ర మట్టం 0.1 మిల్లీ మీటర్, 0.02 ఇంచులకు పెరిగిందని వారు తెలిపారు.