Food

వ్యాయామంలో ఆహార నియమాలు తప్పనిసరి

Diet Control Is Mandatory When WorkingOut And Trying To Lose Weight-వ్యాయామంలో ఆహార నియమాలు తప్పనిసరి

వ్యాయామం చేస్తున్నప్పుడు… సన్నగా మారాలని అనుకున్నప్పుడు… ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం సర్వసాధారణం. ఏ పదార్థాలు మానేస్తున్నా… వీటిని మాత్రం తీసుకోవడం తప్పనిసరి. అవేంటో చూసేయండి.
గుడ్లు: వీటిలో మాంసకృత్తులు ఎక్కువ. చేసే వ్యాయామాన్ని బట్టి ఒకటి లేదా రెండు తీసుకుంటే… మాంసకృత్తులతో పాటు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి కొవ్వు పేరుకోకుండా చేస్తాయి.
గ్రీన్‌ టీ: శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ టీ తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను కరిగించడంతో పాటు ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది. రోజూ కనీసం రెండుకప్పుల గ్రీన్‌ టీ తాగాలి. రోజంతా చురుగ్గా ఉంటారు.
స్మూథీలు: వీటిని ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు. వీటితో త్వరగా ఆకలీ వేయదు. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సగం అరటిపండు, మరేదయినా పండు, పాలు, పెరుగు, తేనె, ఖర్జూరాలు… ఇలా ఏవో ఒకటి కలిపి స్మూథీలు తయారు చేసుకోవచ్చు.
ద్రవపదార్థాలు: ఆకలి వేసినప్పుడు… ఏదో ఒకటి తినడం కన్నా… గ్లాజు మజ్జిగ, తాజా పండ్లరసం… ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. పొట్ట నిండినట్లు ఉంటుంది. శరీరానికి శక్తీ అందుతుంది.