DailyDose

సలహాలు కోరుతున్న ఆర్ధిక శాఖ -వాణిజ్య వార్తలు – 08/17

Indian finance ministry seeking suggestions

*ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా అవతరించేందుకు బ్యాంక్‌ బ్రాంచ్‌ ల నుంచి సలహాలు స్వీకరిస్తోంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇవాల్టి నుంచి ప్రారంభమై నెలపాటు సాగే ఈ కన్సల్టేషన్ ప్రక్రియలో బ్రాంచుల నుంచి ఐడియాలను తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ లను ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ సూచనలే భవిష్యత్తు లో బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ సిద్ధం చేసేందుకు ఇన్‌ పుట్స్‌‌ లాగా ఉపయోగపడనున్నాయి. ఇండియన్ గ్రోత్ స్టోరీలో యాక్టివ్ పార్టనర్లుగా పీఎస్‌‌బీలను ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశమనిఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024–25 వరకుఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నిర్మిం-చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
*ముడిచమురు ధరలపై అమెరికా మాంద్యం భయాల ప్రభావం పడింది. గురువారం 3% తగ్గి, బ్యారెల్ చమురు ధర.. 58 డాలర్ల దిగువకు చేరింది. అమెరికాలో ముడిచమురు నిల్వలు అనూహ్యంగా పెరగడం కూడా ఇందుకు తోడైంది.
*తమ వాణిజ్యం, సాంకేతికతను ఇబ్బంది పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతిచర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను చైనా హెచ్చరించింది. ‘మా దిగుమతులపై అదనపు పన్నులు వేస్తే, అందుకు ప్రతిగా తీవ్ర చర్యలు తీసుకునేందుకు మేం వెనకాడబోము’ అని చైనా మంత్రివర్గం పేర్కొంది.
* పాడి పరిశ్రమ, కోళ్లు, చేపలు, గుడ్లు, మాంసం, వాటి ఉత్పత్తులతో వ్యాపారం, క్యాటరింగ్ చేసేందుకు లైసెన్సు పొందిన ఆహార వ్యాపార నిర్వాహకు (ఎఫ్బీఓలు)లకు ఆహార భద్రతా ఆడిట్ తప్పనిసరి అని పేర్కొంటూ, భారత ఆహార భద్రతా, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
* మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి పనిచేయొద్దని… వారి పాపాల్లో తాము భాగస్వాములం కాదలచుకోలేదని వందల మంది గూగుల్ ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని అభ్యర్థించారు. గూగుల్తో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్లు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందిస్తున్నాయి.
*గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన 25 ప్రధాన ప్రాజెక్టులపై దాదాపు రూ.83,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఓఎన్జీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శశి శంకర్ పేర్కొన్నారు. ఇందులో 15 ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నామని, ఇవి చమురు- గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడతాయని వివరించారు.
*రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) అనంతరం ఆ సంస్థ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద గణనీయ స్థాయిలో పెరిగింది. రెండు రోజుల్లోనే రూ.29,000 కోట్లు అధికమైంది.