DailyDose

చీకట్లోకి చిదంబరం పరార్-నేరవార్తలు–08/21

Chidambaram Goes Missing-Telugu Crime News Today-08/21

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మంగళవారం న్యాయస్థానాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో చిదంబరానికి అరెస్టు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
* ఇటలిలో ఇసుకను చోరీ చేస్తే జైలుకే
సముద్రపు ఒడ్డున ఇసుకను దొంగలించడం కూడా ఇటలీలో నేరమే. అలా చేసి ఇద్దరు ఫ్రెంచ్ టూరిస్టులు జైలు పాలయ్యారు. శార్డీనియాలోని చియా బీచ్‌లో 90 పౌండ్ల ఇసుకను దొంగలించిన ఇద్దరు ఫ్రెంచ్ టూరిస్టులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 14 సీసాలలో ఇసుకను తీసుకుని నౌకలో తమ దేశానికి వెళ్లిపోతున్న వారిద్దరినీ ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇసుకను తమ పర్యటనకు గుర్తుగా తీసుకువెళుతున్నామని వారు చెప్పినప్పటికీ పోలీసులు తమ చట్టాల ప్రకారం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.అక్కడి చట్టాల ప్రకారం ఇసుకను చౌర్యం చేసిన ఆ ఇద్దరు టూరిస్టులకు ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. 2017 ఆగస్టులో చేసిన చట్టం ప్రకారం శార్డీనియాలోని బీచ్‌లలో ఇసుక, గవ్వలు, ఆల్చిప్పలు, శంఖాలు వంటివి తీసుకెళ్లడం నేరం. గత ఏడాది లండన్‌కు చెందిన ఒక పర్యాటకుడు ఇఉకను తనతో తీసుకెళ్లిన నేరానికి వెయ్యి యూరోలను జరిమానాగా కట్టాల్సివచ్చింది. పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ రకమైన కఠిన శిక్షలు విధించాల్సి వచ్చిందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
* కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామంలో కిరాణం షాపులో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలు.
* బాపులపాడు మండల తాసిల్దార్ కార్యాలయం పై పడిన పిడుగు…..కార్యాలయంలోని కరెంటు యుపిఎస్ దగ్ధం….
వెంటనే స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
* సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్‌ తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.
* 2008 నాటి మాలేగావ్‌ బాంబు పేలుడు కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ: అత్యున్నత యాంటి టెర్రరిస్టు దర్యాప్తు సంస్థ) ఆగస్టు రెండవ తేదీన ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఓ దరఖాస్తు దాఖలు చేసుకొంది. ఇక్కడ కేసును గోప్యంగా విచారించడం అంటే కేసుతో సంబంధం ఉన్న నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, అవసరమైన కోర్టు సిబ్బంది మినహా మిగతా ప్రజలు ఎవరూ కోర్టు హాలులో ఉండరాదు. ముఖ్యంగా మీడియాను అనుమతించరాదు.
* ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..ఐదుగురికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బార్మర్‌లోని ఆస్పత్రికి తరలించారు. చౌహాన్ టౌన్ నుంచి వస్తోండగా ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
* బీహార్‌లోని సరన్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌)కు చెందిన ఇద్దరు పోలీసులను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. దుండగుల దాడిలో మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డారు.
* ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. పొదిలి డిపోకు చెందిన హైదరాబాద్‌ సర్వీసు బస్సు కనిగిరి వెళుతోంది. చింతలపాలెంకు చెందిన ఆటో కనిగిరి వైపు వెళుతుండగా రెండు వాహనాలు డిపో సమీపంలో ఢీ కొన్నాయి
* చలామణీలో లేని పాతనోట్లు మార్చాలని ఓ వ్యాపారిపై ఒత్తిడి తెస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. కోటి రూపాయల విలువ చేసే పాతనోట్లకు రూ.15 లక్షలు కొత్త నోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తితో కొందరు ఒప్పందం చే సుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి తప్పించుకు తిరగడంతో పాత నోట్లు కలిగి ఉన్న ముఠా ఆ వ్యక్తి స్నేహితుడైన వ్యాపారి వద్దకు వచ్చారు. పాత నోట్లను మార్చే బాధ్యత వ్యాపారిదే అని ఒత్తిడి చేశారు. వ్యాపారి తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పినా వినకుండా తుపాకీతో బెదిరించి హతమారుస్తామనడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి సహకారంతో అగనంపూడి టోల్ గేట్ వద్ద పాత నోట్లు ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* ఉత్తరకాశీలో హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లో వర్షాలు ముంచెత్తుతుండటంతో వరద బాధితులకు నిత్యావసరాలు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుండి బూర్గంపాడు మీదుగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు, ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.38 కేజీల గంజాయి, ఒక ఆటోస్వాధీనం.
*ఓ మహిళా కౌన్సిలర్ కు మేయర్ కొడుకు కన్న కొట్టిన సంఘటన బీహార్‌లోని పాట్నా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకుంది. పదేపదే నవ్వుతూ కన్నుకొట్టడంతో ఆమె ఈ విషయాన్ని సిఎం నితీశ్ కుమార్ దృష్టికి తీసుకుపోయింది. ఇటీవల నిర్వహించిన పాట్నా మునిసిపల్ కౌన్సిల్ మీటింగ్ కి మహిళా వార్డు కౌన్సిల్ సభ్యురాలు పింకీదేవి హాజరయ్యారు.
*మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండీలోని చందన్‌ పార్కు వద్ద పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు..
*మహేశ్వరం, యాలాల, ఎడపల్లి, వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు అత్యాచారానికి గురయ్యారు. నాన్నమ్మ ఊరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ బాలిక (17)ను మాటల్లోకి దింపి ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
* దావత్‌లో చెలరేగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారి తీసింది. రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట్ పొచ్చమ్మ దేవాలయం దగ్గర మంచిరేవుల, కొల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు దావత్ చేసుకుంటుండగా మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు బీర్ బాటిల్‌తో కొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…
*పోలీసుల దాడి. మేనేజర్‌సహా నలుగురి అరెస్టుగత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. మేనేజర్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు.
*రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమాన్ నగర్‌లో, అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. సొంత మేనమామ నయీమ్‌పై షౌకట్ అనే యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నయీమ్ పరిస్థితి విషమంగా ఉంది. నయీమ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నయీమ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
*జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందారు..
*ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మెట్టబోడుతండాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులందరు నర్సపాలెం, పెద్దగుడిపాడు వాసులుగా గుర్తించారు…
*నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ కి చెందిన పాత నేరస్థుడు గోపిశెట్టి గుణ కత్తులతో వీరంగం సృష్టించాడు అర్దరాత్రి రామ నగర్ లో తన అనుచరులతో వీరంగం సృష్టించాడు ప్రభు అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి అతని వాహనం బుల్లెట్ ని ధ్వంసం చేసి పరారైయ్యాడుఆరవ పట్టణ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టోల్ గేట్ వద్ద లారి బోల్తా, ఇద్దరు మృతి దాదాపు 40 మంది బత్తాకాయ కూలీలతో యర్రగొండపాలెం వైపు వస్తున్న లారీసంఘటన స్థలానికి చెరుకుకొన్నస్సై ముక్కంటి
క్షతగాత్రులను 108 వాహనంలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.
*వివాదాస్పద ఇస్లాం ప్రభోదకుడు జకీర్ నాయక్ ను మలేషియాలో ఎక్కడా ప్రసంగాలు చేయకుండా అక్కడి పోలీసులు మంగళవారం నిషేధం విధించారు. భిన్న జాతులు గల మలేసియాలో ఆయన జాతి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో నిషేధం విధించినట్లు పోలీస్ అధికారి అస్మావతి అహ్మద్ తెలిపారు.
*సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి మోసపూరితంగా అక్రమ మార్గంలో రూ. 354 కోట్ల ఋణం పొందినట్లు ఆరోపణలు ఎదురుకొంటున్న కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాద్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేసారు. ఈ విషయాన్నీ అధికారులు మంగళవారం వెల్లడించారు.
*బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
*వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యవసర వస్తువులు తరలిస్తున్న హెలికాప్టర్‌.. పవర్‌ కేబుల్‌ను ఢీకొట్టింది.
*రైలు నుండి జారిపడటంతో యువకునికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం సంతబమ్మాళి లో చోటు చేసుకుంది. సంతబమ్మాళి మండలం దండుగోపాలపురం రైలు నిలయం సమీపంలో యశ్వంత్‌ పూర్‌ రైలు నుంచి జారిపడి ఓ యువకుడికి గాయాలయ్యాయి.
*మచిలీపట్నం, వలందపాలెం వద్ద ప్రధాన రహదారిపై బైకును ఢీకొన్న నరసాపురం డిపో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సు. బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి.మృతి చెందిన వ్యక్తి పైడేశ్వరరావు వలందపాలెం సమీపంలోని మాచవరం మెట్టు వద్ద నివాసం ఉంటున్నారు. పాల ప్యాకెట్లు, టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రాజంపేట మాజీ ఎమ్మెల్యే …మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మృతి. గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగామైదుకూరు సమీపంలో మృతిచెందారు . 1994..1999 లో రాజంపేట ఎమ్మెల్యేగా పనిచేశారు
*భద్రాచలం నుండి బూర్గంపాడు మీదుగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు, ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.38 కేజీల గంజాయి, ఒక ఆటోస్వాధీనం
*మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండీలోని చందన్‌ పార్కు వద్ద పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు
*సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మోసపూరితంగా, అక్రమ మార్గంలో రూ.354 కోట్ల రుణం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు.
*విదేశీ కరెన్సీని అక్రమంగా సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విమాన ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు.
*తాంత్రిక వైద్యం పేరుతో దంపతులు ఒక మహిళ ఉసురుతీశారు. ఝార్ఖండ్ రాష్ట్రం గర్వా ప్రాంతంలో కొండిర గ్రామంలో రుడానీదేవి అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది.
*చేతబడి చేశారన్న అనుమానంతో ఇద్దరి ప్రాణాలు బలికొన్న అమానవీయ సంఘటన ఇది.. ఒడిశాలోని కేంఝర్ జిల్లా దమ్మెబారి ఠాణా నెకండపల్లిలో చోటుచేసుకుంది.
*మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిమిత్తం చేపట్టిన భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కేసులో గజ్వేల్ ఆర్డీవో డి.విజయేందర్రెడ్డికి, కొండపాక తహసీల్దార్ బి.ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
*వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్ను మలేసియాలో ఎక్కడా ప్రసంగాలు చేయకుండా అక్కడి పోలీసులు మంగళవారం నిషేధం విధించారు.
*కొందరు సైబర్ నేరగాళ్లు ఖనిజాభివృద్ధి సంస్థ వెబ్సైట్లోకి చొరబడి, నేరుగా ఇసుక వేలంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు బాధిత వినియోగదారుల ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు ‘చొరబాట్లు నిజమే’ అని తేల్చారు.
*భర్త శశిథరూర్ వేధింపులే సునందా పుష్కర్ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు దిల్లీ పోలీసులు ఆరోపించారు. భర్తతో వివాహబంధంలో తలెత్తిన సమస్యల మూలంగా సునందా పుష్కర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురైనట్లు వారు మంగళవారం సంబంధిత న్యాయస్థానానికి తెలియచేశారు.
* గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటున్న అధికారిని అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది.
*ఇంజినీరింగ్ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది.
*విద్యార్థులే లక్ష్యంగా గొలుసుకట్టు మోసానికి పాల్పడిన ఈ-బిజ్ ఎండీ పవన్ మల్హాన్, ఆయన కుమారుడు హితిక్ మల్హాన్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
*అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి.. 27 ఎర్రచందనం కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
*మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మేనల్లుడు రతుల్ పూరీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.