యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన బెన్‌స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి ఒక్కరూ అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్‌స్వాన్ అయితే తన ఆనందాన్ని భిన్నంగా వ్యక్తీకరించాడు. తనకే ఓ సోదరి ఉంటే కచ్చితంగా బెన్‌స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేస్తానని సంచలనం సృష్టించాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం అతడికిచ్చి పెళ్లి చేస్తాను’ అని ట్వీట్ చేశాడు. అతడి వ్యాఖ్యలు ట్విటర్‌లో ఫైర్ సృష్టించాయి. స్వాన్ ట్వీట్‌ను విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. కొందరు హాస్యంతో బదులిస్తున్నారు. ‘నాకేం ఆలోచనలు లేవు. బెన్‌స్టోక్స్‌ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని అనుకుంటున్నాను’, ‘స్వాన్.. నేనే అతడిని పెళ్లి చేసుకోవాలని నా భావన’, ‘నాకైతే చెల్లెల్లు లేరు. కానీ ఒకరిని దత్తత తీసుకోవాలని మా అమ్మను అడుగుతాను, అతడికిచ్చి పెళ్లిచేయమంటాను’ అని ట్వీట్లు చేస్తున్నారు. ఒకరైతే.. ‘ఇది 21వ శతాబ్దం స్వాన్, నువ్వే అతడిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఆ వరుసలో ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆసీస్‌తో మూడో టెస్టులో 359 పరుగుల లక్ష్యఛేదనలో 245/4తో ఉన్న ఇంగ్లాండ్ చకచకా ఐదు వికెట్లు కోల్పోవడంతో 286/9కు పరిమితమైంది. ఈ దశలో ఆఖరి వికెట్ జాక్‌లీచ్ (17 బంతుల్లో 1*)తో కలిసి బెన్‌స్టోక్స్ (135*; 219 బంతుల్లో 11×4, 8×6) అద్భుతం చేశాడు. ఓటమి అంచున నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అద్వితీయమైన విజయం అందించాడు. జులైలో అతడు ప్రపంచకప్ ఎలా గెలిపించాడో ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. ఇప్పుడూ అలాంటి ఇన్నింగ్సే ఆడటం గమనార్హం.
స్టోక్స్‌కు పెళ్లి సంబంధాల వెల్లువ

Related tags :