Devotional

ఈ వారంలో పర్వదినాలు

Festivals This Week-Telugu Devotional News

1.ఈ వారంలో పర్వదినాలు- ఆద్యాత్మిక వార్తలు -09/05

2. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంపుకు ఆమోదం
టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంపు ఆర్డినెన్స్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బోర్డు సభ్యుల సంఖ్య 16 నుంచి 25కు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా మరో నలుగురికి అవకాశం కల్పించింది. దీంతో గతంలో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలుపుకుని 19 మందితో ఉన్న టీటీడీ ధర్మకర్తల మండలి తాజా ప్రభుత్వ నిర్ణయంతో 29కి చేరుకుంది. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తర్వాత టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు కానుంది. ఇటీవలే తుడా చైర్మన్కు టీటీడీ ధర్మకర్తల మండలిలో ఎక్స్అఫిషియో సభ్యుడి హోదా కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే.
3.శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల రేపు
తిరుమల వెంకటేశ్వర స్వామివారితో పాటు తితిదే స్థానిక ఆలయాల ఆర్జిత సేవా టికెట్లు శుక్రవారం ఉదయం పది గంటలకు ఆన్ లిం లో విడుదల కానున్నాయి. రానున్న డిసెంబరు మాసానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు దాదాపు 55 వేల వరకు ఖాళీ ఉంటాయని అంచనా. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30గంటల వరకు దయాల్ యువర్ తితిదే ఈవో కార్యక్రమంలో ఈవో సింఘాల్ భక్తుల ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు.
4.ముంబైలో శ్రీవారి ఆలయానికి స్థలం
ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవిస్ ముంబాయిలో పదహారు సెంట్ల స్థలాన్ని ఆలయానికి కేటాయిస్తూ జరీ చేసిన ఉత్తర్వ్యులను బుధవారం తితిదే ఈవో అనిల్ కుమార్ వినతి మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలోని ప్రధాన ప్రాంతమైన తూర్పు ఆంధ్రాలో స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో శ్రీవారి ఆలయంలో పాటో సమాచర కేంద్రాన్ని తితిదే నిర్మించనుంది.
5.సహ్యాద్రి శ్రేణుల్లో శాంభవి శక్తి
మహారాష్ట్రలొని నాసిక్ ప్రఖ్యాత ఆద్యాత్మిక కేంద్రం. ఇక్కడి త్యంబాకం జ్యోతిర్లింగా దర్శాన్ యాత్ర గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. గోరారాం, కాలరాం, తపోవన్ గంగా మందిర్, సోమేశ్వర, నౌషా గణపతి ఆలయం తదితర దేవస్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మరో గొప్ప ఆలయం సప్త శృంగి మాత నిలయం నాసిక్ నగరానికి 65 కిమీ దూరంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక పర్వతం పై ఈ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఈ మత స్వయంభూవుగా వెలసిందని ప్రతీతి. ఈ ఆలయానికి ఒకవైపు లోతైన లోయలు ఎత్తైన కొండలు భక్తుల ఆహ్లాదాన్ని ఆద్యత్మికతను రెట్టింపు చేస్తాయి. వాణి అని పేరొందిన ఈ శక్తిపీతం నిత్యం వేలాది యాత్రికులతో కళకళ లడుతుంటుంది. భీమాసురుడు అనే రాక్షసుడు మట్టుబెట్టాలన్న మార్కండేయ మహర్షి ప్రార్ధనతో అమ్మ ఇక్కడ ఏడు శక్తుల కలయికతో అవతరించిందని చెబుతారు. పద్దెనిమిది ఎత్తులో సింధూర వర్ణంతో దర్శనమిచ్చే మాట దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఆలయానికి వెళ్ళాలనే 475 మెట్లు ఎక్కాలి. లేదంటే ప్రతి పది నిమిషాలకు ఉండే రోప్ ట్రైన్ ద్వేఆరా అమ్మవారి ముంగిట్లో వాలోచ్చు. భక్తులకు భోజన సరఫరాకు అనేక స్తాల్లు ఉంటాయి.
6. చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 5*
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవము
1803 : తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి జననం.(మ.1890)
1888 : భారతదేశపు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
1922 : ప్రముఖ పత్రికా రచయిత, కవి రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
1926 : ప్రముఖ తెలుగు రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం (మ.2014).
1955 : తెలంగాణకు చెందిన విద్యావేత్త, ఆచార్యులు కోదండరాం జననం.
1986 : భారతీయ వృక్ష శాస్త్రవేత్త గణపతి తనికైమొని మరణం.(జ.1938)
1988 : ప్రముఖ మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
1997 : భారతరత్న మరియు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910).
2010 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
2013 : మాజీ శాసన సభ్యులు,పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు చల్లా కృష్ణనారాయణరెడ్డి మరణం.(జ.1925