Fashion

మహిళలూ…మీరు విపరీతంగా దుస్తులు కొనేస్తున్నారా?

How to control and avoid over buying clothes? Telugu fashion news and tips

ఒకేసారి ఎక్కువ దుస్తులు కొనేస్తుంటారు కొందరు. తీరా కొన్నాక… వాటిల్లో కొన్ని నచ్చక పక్కన పడేస్తారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే… ఏం చేయాలో చూడండి.

* షాపింగ్‌కు వెళ్లేముందు గతంలో కొని వాడకుండా బీరువాలో పెట్టిన దుస్తుల్ని బయటకు తీయండి. వాటికి మెరుగులు దిద్దుకుంటే కొత్త లుక్‌ వస్తుందేమో ప్రయత్నించి చూడండి. ఆ తరువాతే కొత్తవి కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి.
* కొన్ని రకాల వస్త్రాలు చూడగానే నచ్చుతాయి. తీరా కొన్నాక వేసుకుంటే బాగుండవు. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే… కొనేముందు కచ్చితంగా వేసుకుని చూడాలి. రంగు బాగుందనో, మన వద్ద అలాంటి మోడల్‌ లేదనో కొంటే డబ్బు వృథా అవుతుంది.
* శరీరాకృతికి సరిపోయే వాటినే ఎంచుకోవాలి. తక్కువ సైజు ఉండేవి వేసుకుంటే చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తారు. అలాగని వదులుగా ఉండేవి ఎంచుకుంటే లావుగా కనిపిస్తారని మరవకండి.
* ఒకేసారి ఎక్కువ బట్టలను కొనడమూ మంచిది కాదు. కొన్న తరువాత కొన్ని రోజులకు బరువు పెరిగినా, తగ్గినా అవి నిరుపయోగం అవుతాయి. సందర్భానికి సరిపోయేలా ఒకటి రెండు రకాల జతలు కొత్తవి ఎంచుకుంటే చాలు.
* ప్రతిసారి ఒకేరకమైనవి కొనకుండా… మార్కెట్‌లోకి వచ్చిన నయా ట్రెండ్‌లో మీకు నచ్చిన ఒకటి, రెండు మోడళ్లను ఎంచుకొని ప్రయత్నించండి. నప్పితే ప్రయోగం చేసినవారవుతారు. మీకంటూ కొత్త లుక్‌ సొంతమవుతుంది.
* షాపింగ్‌కు వేళ్లేటప్పుడు ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్తారు మహిళలు. అది మంచిదే కానీ… ఎంపిక చేసుకున్న జతల్లో ఏవి బాగున్నాయని మాత్రమే వారిని అడగాలి. అంతేతప్ప రంగు, మోడల్‌కు సంబంధించిన అంశాలపై సలహా అడగకూడదు.