Movies

కర్బందా బందీ కర్ దియా

Kriti Karbandha Dating Rumors

తీన్‌మార్‌ చిత్రంలో పవన్‌ సరసన నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి కృతికర్బందా. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది విడుదలైన ‘వీరే కి వెడ్డింగ్’ చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరు ‘పాగల్‌ పంతీ’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కృతి కర్బందా గత కొన్ని నెలలుగా పులకిత్‌ సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నారట. కృతి కోసం పులకిత్‌ దక్షిణాది వంటకాలను తినడానికి ఇష్టం చూపిస్తున్నారట. ప్రస్తుతం ‘పాగల్‌పంతీ’ షూటింగ్‌లో భాగంగా ముంబయిలో వీరిద్దరి మీద ఓ పాట చిత్రీకరణ జరుగుతుంది. షూటింగ్‌ సమయంలో పులకిత్‌ ఆమెకు తరచూ పువ్వులు, చాకెట్లు పంపిస్తున్నారని బాలీవుడ్‌లో వినికిడి. దీనికి సంబంధించి వారిద్దరు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పులకిత్‌ సామ్రాట్‌కు శ్వేతా రోహిరాతో 2015లో వివాహమయ్యింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో యామీగౌతమితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.