DailyDose

స్టాక్ మార్కెట్‌లోకి రైల్వే-వాణిజ్యం–09/30

IRCTC Goes To Stock Market-Telugu Business News Today-09/30

* ఇరాన్ ఉద్రిక్తతల మరింత ముదిరే చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ఇరాన్ దూకుడుకు అడ్డుకునేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్రిక్తతలు మరింత ముదిరి అంతర్జాతీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.
* ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సిటిసి) నేటినుంచి ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపిఒ) షేర్లను జారీ చేస్తోంది. ఒక్కొక్క షేర్‌ ధరను 315 నుంచి 320 రూపాయిలుగా నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, అర్హులైన ఉద్యోగులకు 10 రూపాయిల రాయితీని ఇవ్వనున్నది. దీనితో ఐఆర్‌సిటిసి ఐపిఒ రిటైల్‌, అర్హులైన ఉద్యోగులకు షేర్‌ ధర 305 రూపాయిలనుంచి 310 రూపాయిలుగా నిర్ణయించింది. ఈ షేర్లు నేటి (సెప్టెంబర్‌ 30) నుంచి అక్టోబర్‌ 3వ తేదీ గురువారం వరకూ అందుబాటులో ఉంటాయి.
*షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ హువామీ.. అమేజ్‌ఫిట్ జీటీఆర్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో 1.2 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, బయో ట్రాకర్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 195 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ వాచ్‌ను రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.9,999 ధరకు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.