NRI-NRT

వైభవంగా WETA ప్రారంభోత్సవం

MP Sumalatha Launches WETA In California | TNILIVE USA Telugu News

Women Empowerment Telugu Association(WETA) ప్రారంభోత్సవ కార్యక్రమం మిల్పిటస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఎంపీ సుమలత అంబరీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయి WETAను అధికారికంగ ప్రారంభించారు. అమెరికాలో తెలుగు మహిళలు మన పందుగలను, సంస్కృతి, సాంప్రదాయాలను మరువకుండా తెలుగుదనాన్ని పరిరక్షిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. WETA ఆధ్వర్యంలో ప్రవాస మహిళలకు మరింత చేయూతను అందించాలని ఆమె ఆకంక్షించారు. WETA ఛైర్మన్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలలుగా ఎందరో స్వచ్ఛంద కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవానికి కృషి చేశారని, అన్ని సంస్థల నుండి ఆదర్శప్రాయమైన అంశాలను ప్రేరణగా తీసుకుని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, వారికి అన్ని విధాలుగా చేయూతను అందించే లక్ష్యంతో WETA స్థాపించినట్లు తెలిపారు. మార్చి 7వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగరంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని భారీ స్థాయిలో WETA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంస్థ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాలిఫోర్నియా నుండి పెద్దసంఖ్యలో మహిళలే కాకుండా అమెరికా నలుమూలల నుండి ప్రవాస మహిళలు తరలివచ్చారు.

https://www.youtube.com/watch?v=LGbMFg7kju4
https://www.facebook.com/jaya.telukuntla/videos/2810638938969068/?t=0