Movies

కల నెరవేరింది

Kalyani Priyadarshan Happy To Act In Malayalam Movie

‘‘నా తల్లితండ్రులు (దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి) ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణమైన… నాకు ఉన్నవన్నీ ఇచ్చిన… మలయాళ చిత్ర పరిశ్రమలో నేనూ భాగం కావాలనేది ఎల్లప్పుడూ నన్ను వెంటాడే కల. స్పెషల్ టీమ్, స్ర్కిప్ట్తో రూపొందుతోన్న మలయాళ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ అన్నారు. దుల్కర్ సల్మాన్కు జంటగా అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న మలయాళ సినిమా మంగళవారం చెన్నైలో ప్రారంభమైంది. మలయాళంలో ఆమెకు రెండో చిత్రమిది. అయితే… పూర్తిస్థాయి కథానాయికగా తొలి చిత్రం. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘మరక్కర్’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అందుకే, దుల్కర్ సల్మాన్ సరసన అవకాశం రావడంతో అమితానందంలో ఉన్నారు. ‘‘నా కలలు నిజం చేస్తున్న దుల్కర్, అనూప్కు కృతజ్ఞతలు. ప్రేక్షకులందరి ఆశీస్సులు కావాలి. అందరూ గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నాను. మాతృభూమి పిలుస్తోంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో సురేశ్ గోపీ, శోభన కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆరేళ్ల విరామం తర్వాత శోభన నటిస్తున్న మలయాళ చిత్రమిది.