NRI-NRT

టాంటెక్స్ “పేరులో ఏముంది?”

TANTEX 146th Nela Nela Telugu Vennela | TNILIVE Texas USA Telugu News

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం TANTEX ఆధ్వర్యంలో 146వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు మరియు 43వ టెక్సాస్ సాహిత్య సదస్సుని అర్వింగ్ పట్టణంలో కూచిపూడి ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశభక్తి గీతంతో మొదలయింది. సత్యం మందపాటి “పేరులో ఏముంది?” అనే అంశంపై మాట్లాడారు.హరి మద్దూరి చరిత్రని ఉన్నది ఉన్నట్లుగా లిఖించాలన్న విషయం మీద మాట్లాడారు. నందివాడ భీమరావు సాహిత్యంలో ధిక్కారం అనే అంశం మీద మాట్లాడారు. సమాజంలో పేదలకి జరిగే అన్యాయం మీద ప్రశ్నించాలని చెప్పారు. మెడికో శ్యాం సాహిత్యంలోని అనేక అంశాల మీద మాట్లాడారు.డాక్టర్ చింతపల్లి గిరిజా శంకర్ పరీక్ష సమీక్ష అనే అంశం మీద మాట్లాడారు. జర్నలిస్ట్ నండూరి రామమోహనరావు గురించి వివరించారు. ధారావాహిక కార్యక్రమంలో భాగంగా మన తెలుగు సిరిసంపదలు అనే అంశం గురించి డాక్టర్ నరసింహారెడ్డి వివరించారు. లెనిన్ ఎందరో మహానుభావులు – ఆధునిక సమాజపు కవితా ప్రయోజనం అనే అంశం మీద మాట్లాడారు. రామచంద్ర నాయుడు సత్య హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు పాడి వాటి భావనని వివరించారు. సురేష్ కాజా గుర్రం జాషువా గురించి వివరించారు.చంద్రహాస్ మద్దుకూరి జాలాది గురించి వివరించారు.

చివరిగా సాహితీ సింధూర చిన్నారుల పాటతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్.హ్యూస్టన్,ఆస్టిన్,సానాంటోనియో,టెంపుల్ అనే పట్టణాల నుండి వందల మంది సాహిత్య ప్రియులు హాజరయ్యారు. విచ్చేసిన సాహిత్య ప్రియులంతా స్వీయకవితలు,వ్యాసాలు,పద్యాలు,తెలుగు సిరిసంపదలు విని ఆనందించారు.ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు అధ్యక్షత వహించగా, అధ్యక్షులు చినసత్యం వీర్నపు, కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, కార్యవర్గ సభ్యుడు సతీష్ తో పాటుగా పూర్వాధ్యక్షులు డా యు.నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కృష్ణారెడ్డి ఉప్పలపాటి, ప్రసాద్ తోటకూర, పాలకమండలి సభ్యులు, మాజీ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి, డా.శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, పాలకమండలి మాజీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి దంపతులు, అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి, శ్రీకుమార్ గోమటం, శిరీష గోమటం, సుమ పోకల, సి యస్ రావు, ఆర్ కె పండిటి, నందివాడ ఉదయ భాస్కర్, కిరణ్మయి వేముల తదితరులు పాల్గొన్నారు.