Agriculture

రెవెన్యూ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

Farmer Attempts Suicide In Pebberu MRO Office

పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

తన వంశపారంపర్యంగా వచ్చిన భూమిని సర్వే చేయండి మొర్రో అని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ సంవత్సరం నుండి ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పుడు అప్పుడు అంటూ చివరకు ఆ నిరుపేద రైతు భూమికే తహసీల్దార్ ఎసరు పెట్టింది.

రియల్టర్లకు తొత్తుగా యారిన తహసీల్దార్ భారీ మొత్తంలో నగదు తీసుకుని బాధితుని కి న్యాయం చేయకుండా రియల్టర్ లకు వత్తాసు పలుకుతూ సర్వే చేయించడం లో జాప్యం చేస్తూ వస్తోంది.

మూడు నెలల క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ బాధితుని కి న్యాయం జరగలేదు.

కొన్ని సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రి పేరు చెప్పి సర్వే జరగకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరు లోని రైతు ఆంజనేయులు తల్లి పేర 1ఎకరా 26 గుంటల భూమి ఉంది.

ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొంత మంది రియల్టర్ లు ఇప్పటికే కొంత కబ్జా చేసారు. బాధితుడు సర్వే కోసం దరఖాస్తు చేసినప్పటినుండి రియల్టర్ లనుండి బెదిరింపులు, మద్యవర్తులతో బేరసారాలు చేయప్రారంభించారు.

రైతు వినలేదని నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారు. పెబ్బేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

ప్రస్తుత తహసీల్దార్ సుజాత గారు నేడు రేపు అనుకుంటా సర్వే చేయకపోవటాన్ని రైతు నిలదీయటం తో నేడు గురువారం సర్వే చేస్తున్న సర్వేయర్ కు తహసీల్దార్ ఫోన్ చేయటం తో సర్వే చేయకుండా వెనక్కి రావటంతో

మనస్తాపానికి గురైన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగడానికి ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు.

ఆందోళన చెందిన రైతు ఈ తహసీల్దార్ ఉన్నంత వరకు నా భూమి నాకు రానివ్వకుండా అడ్డుపడుతుంది.

అంటూ వెంట తెచ్చుకున్న పెట్రోలు తో నేరుగా తహసీల్దార్ చాంబర్ లో పెట్రోలు పోసుకుని అంటించుకుంటుండగా కార్యాలయ సిబ్బంది, తదితరులు కుండతో నీరు పోసి రక్షించారు.

ప్రజావాణి హుళక్కేనా అదికారుల మాటలు ఉట్టి మాటలేనా. ఈ తహసీల్దార్లు మారరా.

పేదరైతులు, బాధితులు ఆత్మహత్య ల బారిన పడాల్సిందేనా అంటూ స్థానికులు తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.