DailyDose

తెదేపా ఎమ్మెల్యేపై కేసు-నేరవార్తలు-10/19

Forgery case lodged on TDP MLA Vallabhaneni Vamsi-Telugu Crime News-10/19

* టీడీపీ ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు: ఎన్నికల వేళ..ఫోర్జరీ చేసి..: ఎమ్మార్వో ఫిర్యాదుతో..! మరో టీడీపీ నేతల మీద కేసు నమోదైంది. అనేక ఆరోపణలతో ఒకరి తరువాత మరొక టీడీపీ నేత కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన ఏకంగా ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో స్థానికంగా పేదలకు ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన ఇళ్ల పట్టాలను అందించారనేది ఆయన మీద అభియోగం. తన సంతకం ఫోర్జరీ చేసి పేదలను మోసగించారంటూ ఆయన మీద తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.

* తాడేపల్లి కృష్ణకెనాల్ జంక్షన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

* కచ్చులూరు వద్ద నేడు ఐదో రోజు కొనసాగనున్న రాయల్ వశిష్ట బోట్ ఆపరేషన్ . గోదావరిలో 50 అడుగుల లోతు, ఒడ్డుకు దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న బోట్. నిన్న ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నంలో 75 మీటర్లు ముందుకు వచ్చిన బోటు. గోదావరి లోపలకు వెళ్లి బోటుకు సరైన విధంగా లంగరు వేసే డీప్ వాటర్ డ్రైవర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు . 51మంది జలసమాధి అయిన కచ్చులూరు దుర్ఘటన జరిగి నేటికి 35రోజులు.

* ఏటీఎం దోచుకునేందుకు విఫలయత్నం. వేమూరు లోని ఎస్బిఐ ఏటీఎం లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు. దొంగలను పట్టుకున్న గస్తీ పోలీసులు

* ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ తేజస్విని ని పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రిలో తేజస్విని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆళ్ల నాని. సీఎం జగన్ ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని, బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం.

* బంద్లో బాగంగా ఖమ్మం బస్టాండ్ వద్ద ఆందోళన కారులు ఆందోళన నిర్వహించారు ..ఈనేపద్యంలో నగరంలో తిరుగుతున్న ఆటోలను ఆందోళన కారులు వెనక్కుపంపుతున్నారు.. బస్టాండ్ సమీపంలో ఆందోళన కారులు ఆటోలను ద్వంసం చేశారు… దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది…. బస్టాండ్ వద్ద ఆందోళణ కారులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహించారు. ..

* నాంప‌ల్లి రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ఉన్న హెరిటేజ్ భ‌వ‌నం నాంప‌ల్లి స‌రాయిలోని ఒక భాగం నేడు సాయంత్రం కూల‌డంతో స‌మాచారం అందిన వెంట‌నే జిహెచ్ఎంసి డిజాస్ట‌ర్ రెస్క్యూ బృందాలు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు ఈ స‌రాయి కూలిన సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి గాయాల‌య్యాయ‌ని తెలిసింది. డి.ఆర్‌.ఎఫ్‌కు చెందిన రెండు ప్ర‌త్యేక బృందాలు, జె.సి.బి, ఇసుజు వాహ‌నంతో స‌హా చేరుకొని వెంట‌నే కూలిన శిథిలాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాయి. ఈ సంఘ‌ట‌నలో గాయప‌డ్డ ఇద్ద‌రిని వెంట‌నే త‌గు చ‌కిత్స‌కై జిహెచ్ఎంసి అధికారులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దాదాపు వందేళ్ల చ‌రిత్ర గ‌ల ఈ నాంప‌ల్లి స‌రాయి విశ్రాంతి భ‌వ‌నాన్ని ఆర‌వ నిజాం మీర్ మ‌హ‌బూబ్ అలీఖాన్ 1919లో 5,828 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ నుండి వ‌చ్చే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం, ఇత‌ర అవ‌స‌రాల‌కు వివిధ గ్రామాలు, ప‌ట్ట‌ణాల నుండి వ‌చ్చేవారి సౌక‌ర్యార్థం ఈ స‌రాయిను నిర్మించారు.

* హైదరాబాద్ లాలాపేట్ లో దారుణం. సోదరి పెంపుడు కుక్కను హత్యచేసిన వ్యక్తి. ఆస్థివివాదంలో తల్లి, సోదరిపై దాడి చేస్తుండగా అడ్డుకున్న కుక్క. కుక్కను కాలుతో గొంతు నులిపి హత్యచేసిన నాగరాజు అనే వ్యక్తి. కేసు నమోదు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. చనిపోయిన కుక్కను పోస్టుమార్టంకు తరలింపు.

*