Movies

అమలగా కంగనా

Kangana Ranaut In Remake Of Amala Paul Movie

అమలాపాల్‌ కథానాయికగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీనిలో ‘కామిని’ అనే అమ్మాయి పాత్రలో అమలాపాల్‌ నటించారు. ఈ సినిమాలో అమలాపాల్‌ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌ ‘ఆడై’ హక్కులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ‘ఆడై’ దర్శకుడు రత్నకుమార్‌తో కలిసి విక్రమ్‌ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారట. ‘ఆడై’ చిత్రంలో అమలాపాల్‌ పోషించిన పాత్ర కోసం కంగనారనౌత్‌ను వారు ఎంపిక చేసుకున్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం కంగనారనౌత్‌ ‘తలైవి’ సినిమాలో నటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.