NRI-NRT

డీసీలో తానా సీపీఅర్

TANA Conducts CPR In Washington DC-Global International Telugu NRI NRT News-డీసీలో తానా సీపీఅర్

గుండెపోటు ప్రమాద సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడే సీపీఆర్ పద్ధతిపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఆర్ పద్ధతిని అమలు చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై శిక్షకులు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శృంగవరపు నిరంజన్, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, ఇతర సభ్యులు ఉప్పుటూరి రాంచౌదరి, కోయా రమాకాంత్, ఉప్పలపాటి అనీల్‌చౌదరి, వేమన మల్లికార్జున, ఎన్ఆర్‌సీ నాయుడు, మన్నవ సుబ్బారావు, GWTCS అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.