NRI-NRT

సెయింట్ లూయిస్ తెలుగు సంఘం దీపావళి వేడుకలు

Telugu Association of St.Louis TAS Diwali 2019 - సెయింట్ లూయిస్ తెలుగు సంఘం దీపావళి వేడుకలు

అమెరికాలో సెయింట్ లూయిస్ లో దీపావళి వేడుకల ఘనంగా జరిగాయి. లిండ్బర్గ్ లోని షామినాడ్ కాలేజి లో సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ నిర్వహించిన ఈ వేడుకల్లో కోటి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్(TAS) దీపావళి పురస్కారాలను ప్రకటించింది. తెలుగువారి మేలు కోసం అమెరికాలో అనేక విధాలుగా కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిని దీపావళి పురస్కారంతో సత్కరించారు. నాట్స్ అధ్యక్షుడిగా అమెరికాలో పలు సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు శ్రీనివాస్ మంచికలపూడిని ఈ పురస్కారం వరించింది. నాట్స్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానిక తెలుగువారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ రమా అట్లూరి, స్థానిక ఆలయ ట్రస్ట్రీ మాజీ ఛైర్మన్ జీవీ నాయుడు, రాజ్యలక్ష్మి, ప్రస్తుత ఆలయ బోర్డ్ ఛైర్మన్ రజనీకాంత్ గంగవరపు, PGNF వ్యవస్థాపకులు శ్రీనివాస్ గుళ్లపల్లి, చిన్నా ముచ్చెర్ల, కూచిపూడి ఛారిటబుల్ ట్రస్ట్ సుజాత ఇంజమూరి, శ్రీథర్ కొత్తమాసు తదితరులకు కూడా టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌని, సెక్రటరీ రమేశ్ కొండ ముట్టి, కల్చరల్ సెక్రటరీ అర్చన ఉపమాక, ట్రెజరర్ రంగ సురేశ్, బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ కుమార్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస భూమా, జగన్ వేజండ్ల, జితేంద్ర ఆలూరి, రాకేశ్ గజగౌని చేతుల మీదుగా అందించారు. డీసీలోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు నాట్స్ ఆహ్వానం అందింది. ఈ సంస్థ తరఫున పిన్నమనేని ప్రశాంత్ ఆ వేడుకల్లో పాల్గొన్నారు.